Opinion Polls
Opinion Polls: ఒపీనియన్ పోల్స్.. ఏ ఎన్నికలు వచ్చినా.. ఇప్పుడు ఇవి సాధారణమయ్యాయి. అయితే ఇందులో కచితత్వం ఎంత అన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రతీసారి ఇండియాలో ఈ ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ ఆధారిత సంస్థ 1960లలో దేశీయంగా ఒపీనియన్ పోల్స్‌ను అభివృద్ధి చేసింది. ఇక మీడియా పోల్ సర్వేలు 1980 లో తెరపైకి వచ్చాయి. ఇందులో 1998లో సక్సెస్ కాగా, 2004లో అట్టర్ ప్లాప్ అయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి కూడా ఒపీనియన్ పోల్స్ ఫలితాలను కొన్ని సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఇందులో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. ఈసారి అంచనాలు ఎలా ఉంటాయో చూడాలి.
కచ్చితత్వంపై అధ్యయనం..
ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ(సీఎస్‌డీఎస్) 1998 నుంచి∙2009 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒపీనియన్ పోల్స్ ఎంత కచ్చితమైనవో విశ్లేషణను విడుదల చేసింది. భారతదేశంలో లోక్‌సభలో మెజారిటీ సాధించాలంటే ఒక రాజకీయ పార్టీ మొత్తం 543 సీట్లలో 272 సీట్లు గెలుచుకోవాలి. .
= 1998 లోక్‌సభ ఎన్నికలలో ముందస్తు ఎన్నికల ఒపీనియన్ పోల్స్ ‘దాదాపు ఖచ్చితమైనవి‘ అని నివేదిక వెల్లడించింది, అయితే 1999 ఎన్నికలలో అంచనా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) పనితీరును కొద్దిగా అంచనా వేసింది.
= 1996లో తొలిసారిగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1998, 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది.
2004 లోక్‌సభ ఎన్నికల్లో వాస్తవ ఫలితాలు చాలా మంది పోల్ పండిట్‌లకు షాక్ ఇచ్చాయి. వివిధ దశల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్/ఎగ్జిట్ పోల్స్ ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారంలోకి రాదని భావించారు. ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపాయి. కానీ కాంగ్రెస్ బీజేపీని మట్టి కరిపించింది.
= ఐదేళ్ల తర్వాత, 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగిన ఒపీనియన్ పోల్స్ మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయాన్ని అంచనా వేయలేకపోయాయి. అప్పట్లో, కాంగ్రెస్ పుంజుకోవడంలో అంచనాలు విఫలమయ్యాయి. యూపీఏ 2004లో 222 సీట్ల నుంచి 2009లో 262 సీట్లకు పెరిగింది.
= 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ దాదాపు 257–340 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. అయితే, ఎన్‌డీఏæు వాస్తవ లెక్కింపు 336 సీట్లకుపైగా ఉంది. నివేదికల ప్రకారం, కొన్ని ఒపీనియన్/ఎగ్జిట్ పోల్‌లు కాంగ్రెస్‌కు ‘ఎప్పటికైనా అత్యల్ప‘ గణనను సరిగ్గా అంచనా వేశాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గ్రాండ్–ఓల్డ్ పార్టీ 44 సీట్లు గెలుచుకుంది. యూపీఏ మొత్తం 59 సీట్లు గెలుచుకుంది.
= 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు దాదాపు 285 సీట్లు వస్తాయని పోల్‌స్టర్లు అంచనా వేశారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని కూటమి 353 సీట్లు గెలుచుకోవడం ద్వారా ఘనవిజయం సాధించింది, బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది. ఇది చాలా మంది ఊహించని ఫలితం. కాంగ్రెస్ 52 సీట్లు, యూపీఏ 91 సీట్లు గెలుచుకున్నాయి.
= 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. అయితే బీజేపీ చెబుతున్నట్లు 400 సీట్లు రాకపోవచ్చని తెలిపాయి. మరి ఈ ఒపీనియన్ పోల్స్ ఏమేరకు నిజమవుతాయో చూడాలి.
ప్రీ–పోల్ సర్వే NDA ఇండియా బ్లాక్
ABP&CVoter సర్వే 373 (BJP : 323)
155 (కాంగ్రెస్: 65)
ఇండియా TV&CNX ఒపీనియన్ పోల్ 393 (BJP: 343)
99 (కాంగ్రెస్: 40)
టైమ్స్ నౌ– ETG సర్వే 386 118
ఇండియా టుడే 335 (BJP: 304)
166 (కాంగ్రెస్: 71)
జీ న్యూస్–మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ 377 94
ఈ సంఖ్యలు వాస్తవ సంఖ్యకు ఎంత దగ్గరగా ఉన్నాయో జూన్ 4న స్పష్టమవుతుంది.