Samantha: సమంత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె తన ముసుగు తొలగించింది. విషయంలోకి వెళితే.. వరుస చిత్రాలు చేస్తున్న షార్ట్ గ్యాప్ తీసుకుంది. గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదలయ్యాయి. మైథలాజికల్ మూవీ శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా సమంత శకుంతల పాత్ర చేసింది. ఈ మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ భరతుడు పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి యావరేజ్ గా నిలిచింది.
కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత బ్రేక్ తీసుకుంది. ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అధికారికంగా సమంత చేతిలో ఒక్క చిత్రం లేదు. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా సమంత ఎంపికయ్యారనే టాక్ వినిపిస్తుంది. సమంతకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.
మరోవైపు ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత-వరుణ్ ధావన్ నటించారు. దీనికి హనీ బన్నీ అనే టైటిల్ నిర్ణయించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ గా హనీ బన్నీ తెరకెక్కింది. సమంత భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొనడం విశేషం. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ లో హనీ బన్నీ స్ట్రీమ్ కానుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచుగా తన పోస్ట్స్ తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. నో ఫిల్టర్ డే సందర్భంగా సమంత తన మేకప్ లెస్ లుక్ షేర్ చేసింది. నాతో పాటు ప్రపంచం చుట్టేయండి. సూర్యకిరణాలతో చర్మాన్ని తాకించండి. వెన్నెలలో అల్లరి చేయండి. పదండి.. సీతాకోకలు ఎగురుతున్నాయి.. అని సదరు ఫోటోకి కామెంట్ జోడించింది. సమంత మేకప్ లేకున్నా చాలా అందంగా ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.