https://oktelugu.com/

హిందువుల ఇళ్లనే కూల్చుతారా..? బండి సంజయ్..

తెలంగాణ బీజేపీ అధికార ప్రభుత్వంపై ఫైర్ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతంటూ ప్రభుత్వం హిందువుల ఇళ్లనే కూల్చివేస్తున్నారన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తాజాగా బండి సంజయ్ లేపిన ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం అక్రమంగా నిర్మించిన వాటిని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2021 / 12:48 PM IST
    Follow us on

    తెలంగాణ బీజేపీ అధికార ప్రభుత్వంపై ఫైర్ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల కూల్చివేతపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతంటూ ప్రభుత్వం హిందువుల ఇళ్లనే కూల్చివేస్తున్నారన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో తాజాగా బండి సంజయ్ లేపిన ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

    అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం అక్రమంగా నిర్మించిన వాటిని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు వాటిని కూల్చేస్తున్నారు. ముఖ్యంగా నాళాలపై ఉన్న నిర్మాణాలను తీసేస్తున్నారు. నాళాలపై నిర్మాణాలు ఉండడంతో వర్షాలు పడినప్పడు వరదనీరు వెళ్లకుండా సమస్య ఎదురవుతుందని, అందువల్ల ఇలాంటి నిర్మాణాలను కూల్చివేస్తన్నారు.

    అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం మంచి పనే అయినా కొన్ని ప్రాంతాల్లో కూల్చేసి, మిగతా ప్రాంతాలకు మినహాయింపులు ఇవ్వడంపై బీజేపీ మండిపడుతోంది. ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్ ప్రాంతాల్లో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అక్కడ కూడా కూల్చివేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

    ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేవలం హిందువులు ఉన్న ఏరియాలోనే ఇళ్లు కూల్చివేస్తున్నారనన్నారు. ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందున అక్కడ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలన్నారు. ఇది ఒకరకంగా మెజారిటీలపై ప్రభుత్వం చేస్తున్న దాడి అని అన్నారు.