జార్ఖండ్ లో ఉదయం జాగింగ్ కు వెళ్లిన ఓ డిస్ట్రిక్ట్ అండ్ అడిషనల్ జడ్డిని హత్య చేశారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరగగా మొదట దీనిని ప్రమాదంగానే అందరూ భావించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. అయితే తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజీ ఇది హత్యేనని తేల్చింది. జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా జడ్జిగా ఉన్నా ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో జాగింగ్ కు వెళ్లారు. ఈ సమయంలో వెనకి నుంచి వేగంగావచ్చిన టెంపో ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపో డ్రైవర్ కావాలనే జడ్జి వైపు వెళ్లి ఢీకొట్టినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అంతేకాదు ఈ హత్య చేయడానికి కొన్ని గంటల ముందే ఆ వాహనాన్ని దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Law & Order Under @HemantSorenJMM
& @RahulGandhiDhanbad District and Sessions judge openly murdered on the streets of Jharkhand. pic.twitter.com/H0WfiMuqyA
— Sameet Thakkar (Modi Ka Parivar) (@thakkar_sameet) July 28, 2021