https://oktelugu.com/

జేసీ సోదరులకు బీజేపీ తలుపులు మూసిందా?

ఇప్పటివరకు జేసీ సోదరులకు అనంతపురం జిల్లా కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో ఆ కోటకు బీటలు వారాయి. సీఎం జగన్ నజర్ పెట్టడంతో ఇప్పుడు కోట గోడలు కూలాయి. ఏకంగా జైలు పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ హయాంలో రాజులుగా బతికిన జేసీ కుటుంబం ఇప్పుడు కేసులతో జైలు పాలు అవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. Also Read: చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా? వైసీపీ… జేసీ సోదరులను ఆర్థికంగా.. సామాజికంగా అనంతపురం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2020 8:53 pm
    Follow us on


    ఇప్పటివరకు జేసీ సోదరులకు అనంతపురం జిల్లా కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో ఆ కోటకు బీటలు వారాయి. సీఎం జగన్ నజర్ పెట్టడంతో ఇప్పుడు కోట గోడలు కూలాయి. ఏకంగా జైలు పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ హయాంలో రాజులుగా బతికిన జేసీ కుటుంబం ఇప్పుడు కేసులతో జైలు పాలు అవుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది.

    Also Read: చంద్రబాబు మౌనం.. మరణ శాసనమేనా?

    వైసీపీ… జేసీ సోదరులను ఆర్థికంగా.. సామాజికంగా అనంతపురం జిల్లాలో చావు దెబ్బతీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఏ సహాయం అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేసుల మీద కేసులు నమోదవుతుంటే ఏం చేయాలో పాలుపోక బీజేపీ వైపు చూస్తున్నారు జేసీ బ్రదర్స్.

    జేసీ ఫ్యామిలీ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. బస్సుల నకిలీ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అతడి కుమారుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో వీరికి మద్దతు ఇచ్చేవారు కూడా జిల్లాలో నోరు మెదపడం లేదు. అనంతపురంకే చెందిన టీడీపీ దిగ్గజ నేతలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ సహా ఏ నేత వీరికి సానుభూతి తెలపడం లేదు. ఇక ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అన్నయ్య జేసీ దివాకర్ రెడ్డి నోరు కూడా మూగబోయింది.

    Also Read: తమ్మినేని మౌనం వెనుక కారణం అదేనా?

    ప్రస్తుతం వైసీపీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి జేసీ సోదరులు బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే బీజేపీ తమకు ఎలాంటి పదవులు ఇస్తుంది? కేసుల విషయంలో వైసీపీపై ఒత్తిడి తెస్తుందా? ఖచ్చితంగా హామీ లభించడం లేదట.. బీజేపీలో చేరితే తమపై కేసుల నుంచి కొంత విరామం పొందవచ్చని భావిస్తున్నారు.

    అయితే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నాయకత్వం మాత్రం జేసీ సోదరుల పట్ల ఆచితూచి ఆలోచిస్తున్నట్టు సమాచారం. జేసీ సోదరుల వివాదాస్పద వ్యాఖ్యలు.. వారి నియంత్రణ లేని రాజకీయాలు.. పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతీస్తుందని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు. అందువల్ల జేసీ సోదరులను చేర్చుకునే అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. దీంతో జేసీ బ్రదర్స్ కు బీజేపీ తలుపులు తెరవడం లేదని తెలుస్తోంది.