
కరోనా నిరోధానికి ఇప్పటికే ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్టీరింగ్ కమిటీతో పాటు జిల్లాల్లోనూ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. వీరందరికి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాకి్సన్ పంపిణీకి అవసరమైన డేటా బేస్ సిద్ధం చేయడం, వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయడం ఈ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత పిల్లలు, వ్రుద్ధులకు ఇవ్వనున్నారు.