https://oktelugu.com/

హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయాక తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని జూన్‌ 2న నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌‌ 1న నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వేరయ్యాక అక్కడ అవతరణ వేడుకలేవీ నిర్వహించలేదు. దీనికితోడు ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎప్పుడూ గందరగోళమే నెలకొంది. Also Read: పేదల కోసం సోము వీర్రాజు ఓ మంచి నిర్ణయం గతంలో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తేదీ ఒకటి కావడం, ఆ తర్వాత […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 12:57 PM IST
    Follow us on


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయాక తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని జూన్‌ 2న నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌‌ 1న నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వేరయ్యాక అక్కడ అవతరణ వేడుకలేవీ నిర్వహించలేదు. దీనికితోడు ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎప్పుడూ గందరగోళమే నెలకొంది.

    Also Read: పేదల కోసం సోము వీర్రాజు ఓ మంచి నిర్ణయం

    గతంలో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తేదీ ఒకటి కావడం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తేదీ మరొకటి కావడం, అనంతరం విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటు తేదీ ఇంకొకటి కావడం. ఇందులో దేన్ని ఎంచుకోవాలనే దానిపై గతంలో తర్జనభర్జన పడిన టీడీపీ సర్కారు చివరికి కొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్‌ 2నే అవతరణ వేడుకలకు బదులు నవనిర్మాణం పేరుతో కార్యక్రమాలు నిర్వహించేది.

    అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నవంబర్‌‌ 1నే ఈ వేడుకలు నిర్వహించాలని పట్టుబట్టింది. ఇప్పుడు ఎలాగూ వైసీపీనే అధికారంలో ఉంది. దీంతో ఏడాదిన్నర తర్వాత ఇదే తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్‌‌ 1నే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపనున్నారు.

    Also Read: తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు

    గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూన్‌ 2న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ.. తాము అధికారంలోకి రాగానే తిరిగి నవంబర్‌ 1న నిర్వహిస్తామని ప్రకటించింది. చివరికి తీవ్ర తర్జన భర్జనల మధ్య గతంలో తాము వినిపించిన పాత డిమాండ్‌ నవంబర్‌ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా గుర్తిస్తూ వైసీపీ సర్కార్‌ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో నవంబర్‌ 1న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ వేడుకలు నిర్వహించేందుకు 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.