https://oktelugu.com/

పేదల కోసం సోము వీర్రాజు ఓ మంచి నిర్ణయం

ఏ రాష్ట్రంలోనైనా వందలాది మంది లీడర్లు ఉంటారు. కానీ.. అందులో పేదల గురించి ఆలోచించే వారు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటారు. నిత్యం పేదలకు ఏదో చేయాలనే తపన వారికే ఉంటుంది. ఏదో ఒక రూపంలో సాయం చేయాలని తలుస్తుంటారు. అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. తాము రాజకీయాల్లో ఉన్నందుకు పేదల తరఫున ఉండాలనే కోరుకుంటుంటారు. ఆ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. Also Read: బీహార్‌‌ పోలింగ్ లో అనూహ్యం: […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 12:03 PM IST
    Follow us on

    ఏ రాష్ట్రంలోనైనా వందలాది మంది లీడర్లు ఉంటారు. కానీ.. అందులో పేదల గురించి ఆలోచించే వారు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటారు. నిత్యం పేదలకు ఏదో చేయాలనే తపన వారికే ఉంటుంది. ఏదో ఒక రూపంలో సాయం చేయాలని తలుస్తుంటారు. అందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. తాము రాజకీయాల్లో ఉన్నందుకు పేదల తరఫున ఉండాలనే కోరుకుంటుంటారు. ఆ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

    Also Read: బీహార్‌‌ పోలింగ్ లో అనూహ్యం: ఓటర్లకు ప్రధాని కీలక సూచన

    సోము వీర్రాజుది విద్యార్థి దశ నుంచీ ఒకటే పార్టీ. ఏబీవీపీతో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆర్‌‌ఎస్‌ఎస్‌లోనూ పనిచేశారు. ఇప్పుడు ఏకంగా దాని అనుబంధ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దాదాపు 42 ఏళ్లపాటు పార్టీలో ఆయన వివిధ హోదాల్లో కొనసాగారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ నేత అందిస్తున్న సేవలను గుర్తించి బీజేపీ హైకమాండ్‌ ఉన్నత పదవిని అప్పజెప్పింది. గతంలోనే పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడినా.. అదిష్టానం ఇవ్వలేదు. అయినా నిరుత్సాహపడకుండా.. పార్టీని వీడకుండా సేవలందించారు.

    ఏపీ అధ్యక్ష పదవి ఎట్టకేలకు సోమువీర్రాజుకు దక్కింది. ఈ పదవి చేపట్టినప్పటి నుంచి సోము వీర్రాజు ఏపీలో ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూనే ఉన్నారు. అక్కడ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనా తన వాయిస్‌ బలంగా వినిపించారు. దీక్షలు చేపట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ముఖ్యంగా అంతర్వేది ఎపిసోడ్‌లో సోము వీర్రాజు తీసుకున్న స్టెప్ కు ప్రజల్లోనూ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రజలూ ఆయనతో జతకట్టారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. దెబ్బకు దిగొచ్చిన సర్కార్‌‌ ఆ ఘటనపై సీబీఐ విచారణ కోరింది.

    ఒకప్పుడు రాష్ట్రంలో టీడీపీతో జతకట్టిన బీజేపీ.. ఇప్పుడు ఒంటరిగానే ముందుకెళ్తోంది. ఈ నిర్ణయం వెనుక కూడా సోము వీర్రాజు ఉన్నట్లు టాక్‌. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి పేరు రాకపోవడం.. పోయిన ఎన్నికల్లో దెబ్బతినడం అంతా కూడా టీడీపీ వల్లేనని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్రం కూడా వీర్రాజు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇక అప్పటి నుంచి సొంతంగానే రాష్ట్రంలో బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. సమస్యలపై పోరాడుతోంది.

    Also Read: ప్రతిపక్షం ఎవరో దుబ్బాక డిసైడ్ చేస్తుందా?

    ఇక ఇప్పుడు ప్రజల కోసం ఆయన ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రచార ఆర్భాటాన్ని పక్కనబెట్టి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం అమలు చేశారు. అదేంటంటే.. తనను కలవడానికి వచ్చేవారు శాలువాలు తీసుకురావద్దని, పేదలకు ఉపయోగడే వస్త్రాలు తీసుకురావాలని కోరారు. ‘నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను. నన్ను కలిసే సందర్భాల్లో గౌరవార్థంగా తీసుకొచ్చే శాలువాలకు బదులుగా పేదల సహాయం కోసం ఉపయోగపడే వస్త్రాలు మాత్రమే తీసుకుని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ట్విట్టర్ లో నేతలకు సూచించారు.

    అంతేకాదు.. ‘పేదల అవసరాలకు వీలుగా మనం వస్త్ర దానం కూడా చేయొచ్చు. నిరుపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా చేసే కార్యక్రమాన్ని నేటితో విరమించుకోవాల్సిందిగా నాయకులు, కార్యకర్తలందరికీ మనవి. పేదలకు పంచేందుకు వీలుగా ఉండే తువ్వాళ్లు, లుంగీలు, పంచలు లాంటి వస్త్రాలు పేదల సహాయార్థం స్వీకరించబడతాయి’ అని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాల్లో ప్రచార ఆర్భాటం కోసం పరితపించే నాయకులున్న ఈరోజుల్లో సోము వీర్రాజు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీ కార్యకర్తల్లోనూ.. అటు అభిమానుల్లోనూ సంతోషం వెల్లివిరిసింది.