https://oktelugu.com/

అమ్మాయి లవర్ అన్నారు.. 10వేలు కట్టా.. మోసపోయిన హైపర్ ఆది

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు.. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాల్లేక ఎంతోమంది తెరవెనుకే ఉండిపోయారు. కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా.. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఏదో ఒక చిన్న అవకాశం దక్కించుకుని రాణించేందుకు ప్రయత్నిస్తుంటారు. Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్న వారిని మోసం చేసేందుకు కొందరు కాచుకొని చూస్తుంటారు. అలాంటి వారికి చిక్కారో ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 01:00 PM IST
    Follow us on


    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు.. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాల్లేక ఎంతోమంది తెరవెనుకే ఉండిపోయారు. కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా.. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగి ఏదో ఒక చిన్న అవకాశం దక్కించుకుని రాణించేందుకు ప్రయత్నిస్తుంటారు.

    Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా

    సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్న వారిని మోసం చేసేందుకు కొందరు కాచుకొని చూస్తుంటారు. అలాంటి వారికి చిక్కారో ఇక అంతే.. మగవాళ్లయితే డబ్బులు పొగొట్టుకుంటే.. అమ్మాయిలు మాత్రం డబ్బులతోపాటు సర్వం కోల్పోయి ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతుంటారు. ఇలాంటి సంఘటనే తనకు ఎదురైందని హైపర్ ఆది తెలిపాడు.

    ‘అలీతో సరదా’ షోలో పాల్గొన్న హైపర్ ఆది సినిమా అవకాశాల కోసం తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. కొందరు తనను దారుణంగా మోసం చేశారంటూ వాపోయాడు. సినిమాల్లో రాకముందు తాను సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసినట్లు తెలిపాడు. వీకెండ్స్ లో సినిమా ప్రయత్నాలు చేసేవాడని అలా తిరుగుతిరుగూ జబర్దస్త్ సెట్లోకి వచ్చిపడినట్లు తెలిపాడు.

    దీనికంటే ముందు తాను కొందరి చేతిలో మోసపోయి డబ్బులు పొగొట్టుకున్నట్లు ఆది తెలిపాడు. సెలబ్రెటీలతో ఫొటోలు దిగే కొందరు తమకు ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయంటూ మోసం చేస్తుంటారని తెలిపారు. ఆ ఫొటోలను అడ్డంపెట్టుకొని అవకాశాల కోసం వచ్చేవారిని నిండా ముంచుతారని తెలిపాడు.

    Also Read: నానికి ఇంకో హీరోయిన్ కావలెను

    కొందరు రీఛార్జులు.. సిగరెట్లు తెప్పించుకుంటారని తెలిపాడు. ఓసారి సినిమా అవకాశం కోసం ఒక ఆఫీసు వెళ్లగా పక్కనే అమ్మాయి ఉందని తెలిపాడు. ఆమె నీ లవర్‌గా నటిస్తుందని.. మంచి రోల్ అని.. రేపటి నుంచి షూటింగ్ అని చెప్పారని తెలిపారు. ఇందుకోసం 10వేలు కట్టాలని చెప్పగా తాను కట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతి రోజు అక్కడి వెళ్లగా అక్కడ ఆఫీస్‌కు తాళంవేసి ఉందని తెలిపాడు. దీంతో తాను బకరా అయినట్లు గుర్తించి వెనుదిరిగినట్లు వాపోయాడు.