రాష్ట్రంలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. 12 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన అక్కుల చెరువు ప్రాజెక్టు పనులు ఏళ్ళ తరబడి పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటించిన శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అక్కుల చెరువును పరిశీలించిన పరిశీలించారు. చెరువు ఆధునీకరణ గురించి ఆరా తీశారు.
ఏళ్ళు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను మంత్రి ప్రశ్నించారు. నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కుల చెరువు అభివృద్ధి నిధులు భారీగా నిరుపయోగంగా అయ్యాయన్నారు. ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతోందని అసహనం వ్యక్తం చేశారు. అక్కుల చెరువును నింపడానికి కావాల్సిన గ్రావిటీ పైప్ లైన్ పనులు, గ్రామాలకు నీరు పంపించే పనులు ఏ మాత్రం జరగలేదన్న స్వయంగా మంత్రి చెప్పారు. దాదాపు 12 గ్రామాలకు త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేశారని, కానీ ఏ ఒక్క గ్రామానికి కూడా నీరు అందిన దాఖలాలు లేవన్నారు. ప్రాజెక్టు అవకతవకలపై విజులెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.