https://oktelugu.com/

మందుబాబుల్లో ఇంత మార్పా!?

ఏమండోయ్ ఇది విన్నారా..? మందుబాబుల్లో మార్పొచ్చింది. కరోనా రాక ముందు, కరోనా వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. కరోనా రాక ముందు రోజువారీగా జరిగే అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం వరకూ అమ్మకాలు నిలిచిపోయాయట. దింతో తెలంగాణలో మద్యం వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది. 45 రోజుల లాక్ డౌన్ తర్వాత తెలంగాణలో మద్యం షాపులు తెరచిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు (మే6 వతేది) వేలాదిమంది మద్యపాన ప్రియులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 16, 2020 4:40 pm
    Follow us on

    ఏమండోయ్ ఇది విన్నారా..? మందుబాబుల్లో మార్పొచ్చింది. కరోనా రాక ముందు, కరోనా వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. కరోనా రాక ముందు రోజువారీగా జరిగే అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం వరకూ అమ్మకాలు నిలిచిపోయాయట. దింతో తెలంగాణలో మద్యం వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది.

    45 రోజుల లాక్ డౌన్ తర్వాత తెలంగాణలో మద్యం షాపులు తెరచిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు (మే6 వతేది) వేలాదిమంది మద్యపాన ప్రియులు వైన్‌ షాపుల ఎదుట కొనుగోళ్లకు బారులు తీరారు. దింతో ఆ ఒక్కరోజే ప్రభుత్వ ఖజానాకి రూ.104 కోట్లు ఆదాయం వచ్చి చేరాయి. ఆ తర్వాత మద్యం అమ్మకాలు రోజు రోజుకి తగ్గిపోయాయి. ఎంతగా తగ్గిపోయాయంటే.. 10 రోజుల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.206 కోట్లు మాత్రమే అంటే రోజుకి సుమారు రూ.20 కోట్ల మాత్రమే ప్రభుత్వ ఆదాయం. దీనిని బట్టి మందుబాబులు మరిపోయినట్టే అనుకోవచ్చేమో.. అయితే మద్యం ప్రియుల మార్పు వెనుక కొన్ని కారణాలు లేకపోలేదు.

    గత 50 రోజులుగా ఇంట్లో కూర్చొని తినడమే తప్ప ఎటునుంచి రూపాయి ఆదాయం లేదు. కుటుంబ పోషణ కోసం అష్ట కష్టాలు పడ్డారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ ఇచ్చిన రూ.1500, మోడీ పంపిన రూ.500 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ కాసిన్ని డబ్బుల్ని మద్యం పాలు చేయడం ఎందుకులే అనుకోని ఉంటారు.

    దీనికి తోడు “మూలిగే నక్క మీద తాటికాయ పడట్టు” ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేని సమయంలో ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ పై 11 శాతం, బ్రాండెడ్‌ మద్యంపై 16 శాతం చొప్పున ధరలు పెంచింది. ఇది కూడా లిక్కర్‌ అమ్మకాలపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

    ఏది ఏమైనా ఐదు రోజుల్లో దాదాపు రూ.400 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్‌శాఖ అంచనా వేసింది. కానీ మద్యం షాపులు తెరిచి 10 రోజులు అయినా ప్రభుత్వ ఖజానాకి వచ్చి చేరింది రూ.310 కోట్లు కావడం విశేషం. కరోనా పుణ్యమా అని మద్యంబాబుల్లో తాత్కాలిక మార్పు రావడం శుభపరిణామం ఈ మార్పు ఇలానే కొనసాగాలని కోరుకుందాం…!