https://oktelugu.com/

బిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు మూవీ!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు తివ్రికమ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘అలవైకుంఠపురములో’. 2020 సంక్రాంతి కానుకగా రిలీజై ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘అలవైకుంఠపురములో’ నిలిచింది. తెలుగు, మలయాళం, యూఎస్ లో భారీ కలెక్షన్లు సాధించింది. 200కోట్లపై కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టు అనిపించుకుంది. ఈ చిత్రం విడుదలై నాలుగు నెలలు గడిచిపోయినా ఈమూవీలోని పాటలకు మాత్రం క్రేజీ తగ్గడం లేదు. ముఖ్యంగా ‘సామజవరగమన’ ‘బుట్టబొమ్మ..’ ‘రాములో రాముల..’ సాంగ్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 16, 2020 / 04:53 PM IST
    Follow us on


    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు తివ్రికమ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘అలవైకుంఠపురములో’. 2020 సంక్రాంతి కానుకగా రిలీజై ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘అలవైకుంఠపురములో’ నిలిచింది. తెలుగు, మలయాళం, యూఎస్ లో భారీ కలెక్షన్లు సాధించింది. 200కోట్లపై కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టు అనిపించుకుంది. ఈ చిత్రం విడుదలై నాలుగు నెలలు గడిచిపోయినా ఈమూవీలోని పాటలకు మాత్రం క్రేజీ తగ్గడం లేదు. ముఖ్యంగా ‘సామజవరగమన’ ‘బుట్టబొమ్మ..’ ‘రాములో రాముల..’ సాంగ్స్ సూపర్ హిట్టుగా నిలిచాయి.

    ఆల్ టైమ్ రికార్డులను తిరగారస్తున్న మరో రికార్డు కొల్లగొట్టిందని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. ‘అలవైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్ కి యూట్యూబ్లో బిలియన్ వ్యూస్(వందకోట్లు) వచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఒక తెలుగు చిత్రానికి ఇంత భారీ స్థాయిలో ప్రజల ఆదరణ లభించడం తొలిసారి అని పేర్కొంది. తమ చిత్రాన్ని ఆదరించడంతోపాటు ఆల్బమ్ ను ఇంత పెద్ద సక్సస్ చేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు అంటూ గీత ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో బుట్టబొమ్మ సాంగ్ నిత్యం ట్రెండింగ్ అవుతూనే ఉంది. టిక్ టాక్, సోషల్ మీడియాలో పలువురు సెలబెట్రీలు బుట్టబొమ్మ సాంగ్ కు డ్యాన్స్ చేసి షేర్ చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్ బుట్టబొమ్మ సాంగ్ కు ఫ్యామిలీతో సహా డాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆకట్టుకుంది.