Holi hangover
Holi Hangover : భారతదేశంలో హోలీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. రంగుల వర్షాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు మద్యం తాగుతుంటారు. ఈ మద్యం ఆరోగ్యానికి హానికరం. చాలా మందికి అది తాగిన తర్వాత హ్యాంగోవర్ రావడం కూడా కామన్ గా చూస్తుంటాం. మీరు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారా? కొన్నిసార్లు హ్యాంగోవర్ తీవ్రంగా మారి ప్రజల ఆరోగ్యం క్షీణించేవరకు కూడా వస్తుంటుంది. అటువంటి స్థితిలో, డాక్టర్ వద్దకు వెళ్లడం అవసరం కూడా అవచ్చు. హోలీ రోజున మద్యం సేవించిన తర్వాత మీరు హ్యాంగోవర్ తో బాధపడుతున్నారా? మరి దీని నుంచి వదిలించుకోవడానికి ఏం చేయాలి? అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
Also Read : హోలీ సెలబ్రేషన్స్ పేరుతో హద్దు దాటారో రంగు పడుద్ది.. తస్మాత్ జాగ్రత్త
మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ ఒక సాధారణ సమస్యగా చూస్తుంటా. ఇది చాలా మందిలో కనిపిస్తుంది కూడా. ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. హ్యాంగోవర్ వల్ల తలనొప్పి, వికారం, అలసట, నిర్జలీకరణాన్ని ఎదుర్కోవడం కామన్. మద్యం తాగడం వల్ల శరీరంలో నీటి లోపం వస్తుంటుంది. దీన్ని నివారించడానికి, నీరు, కొబ్బరి నీరు లేదా ORS తీసుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇది శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. దీనితో పాటు, తాజా పండ్లు తినడం వల్ల శరీరంలో శక్తి తిరిగి వస్తుంది. హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ నీరు హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి ఒక మంచి టిప్. నిమ్మకాయలో విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండి తాగాలి. ఇలా చేస్తే మీరు హ్యాంగ్ ఓవర్ నుంచి దూరం అవచ్చు. వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు, అరటిపండు, బొప్పాయి రెండూ హ్యాంగోవర్‌ను తగ్గిస్తాయి. అరటిపండు పొటాషియానికి మంచి మూలం. ఇది ఆల్కహాల్ వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సరిచేస్తుంది. మరోవైపు, బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
మద్యం సేవించిన తర్వాత హ్యాంగోవర్ వచ్చినప్పుడు, మీ కడుపుని తేలికగా ఉంచుకోవాలి. వేయించిన లేదా భారీ ఆహారాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యమే. తేలికపాటి సూప్, గంజి లేదా ఉడికించిన కూరగాయలు తీసుకోండి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటే, మీరు మీ తలపై చల్లని లేదా గోరువెచ్చని నీటితో కలిపిన కంప్రెస్‌ను ఉంచడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఇది తలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు రిలాక్స్‌గా ఉంటారు. ఈ చర్యలన్నీ చేసినప్పటికీ ఉపశమనం లభించకపోతే, వైద్యుడిని సంప్రదించాలి.
Also Read : హోలీ రంగులు చేతుల నుంచి పోవడం లేదా? ఇలా చేయండి ఎంత మొండి మరకలు అయినా సరే పోవాల్సిందే..