Pragathi
Pragathi : అత్యంత పాపులర్ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ప్రగతి ఒకరు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె అలరిస్తున్నారు. ఎమోషనల్ క్యారెక్టర్స్ తో పాటు కామెడీ కూడా పండించగలరు. ఎఫ్ 2 మూవీలో ప్రగతి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా విజయంలో ప్రగతి సైతం కీలక పాత్ర వహించింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రగతి హీరోయిన్ గా చేసింది. ఆమె సిల్వర్ స్క్రీన్ పై మొదట హీరోయిన్ గానే కనిపించింది. తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్… ప్రగతిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 1994లో విడుదలైన వీట్ల విశేషంగా అనే తమిళ చిత్రంలో ఆమె నటించారు. ఈ చిత్రంలో నటించి దర్శకత్వం వహించాడు భాగ్యరాజ్.
Also Read : వామ్మో నటి ప్రగతి ఫోటో చూశారా? వైరల్ పిక్స్
1997 వరకు ఒక ఆరు చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా చేసింది. తెలుగులో ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ రాలేదు. వివాహం కావడంతో ప్రగతి సినిమాలకు దూరమైంది.
ఓ ఐదేళ్ల గ్యాప్ అనంతరం 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బాబీ మూవీలో ప్రగతి హీరో తల్లి పాత్ర చేయడం విశేషం. విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు, ప్రగతి వయసు దాదాపు ఒకటే. అయినప్పటికీ ఆమె మహేష్ కి తల్లిగా నటించి మెప్పించారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. గత రెండు దశాబ్దాలుగా ఆమె కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అయితే తాను చేసిన కొన్ని తప్పులు కెరీర్ ని నాశనం చేశాయని ఆమె అంటున్నారు. కెరీర్ పై ఇప్పుడు ఉన్నంత దృష్టి అప్పుడు లేదు. నేను ఇప్పుడు చేసినంత కృషి హీరోయిన్ గా చేస్తున్నప్పుడు చేసి ఉంటే వేరేలా ఉండేది. ఇక చిన్న వయసులో వివాహం చేసుకోవడం నేను చేసిన అతిపెద్ద మిస్టేక్. అది అమాయకత్వం కూడా కాదు. మూర్ఖత్వం. అంతా నాకే తెలుసు అనుకున్నాను, అన్నారు.
ప్రగతికి ఒక అమ్మాయి. చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయింది. ప్రస్తుతం కూతురితో పాటు ఒంటరిగా జీవిస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిన ప్రగతి.. సాధించాలనే తపన ఉంటే వయసు అడ్డు కాదని అంటుంది. ఆమె వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ విజయాలు అందుకుంటుంది. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ పై ట్రోలింగ్ జరుగుతుంది. ఆ విమర్శలను ప్రగతి లెక్క చేయదు.
Also Read : బుల్లెట్ రాణిగా మారిన ప్రగతి ఆంటీ… క్రేజీ వీడియో వైరల్, నెటిజెన్స్ కామెంట్స్ షురూ!
Pragathi