ఎంపీనే ఇలా కొడితే.. సామాన్యుల పరిస్థితేంటి?: వీర్రాజు

ఒక రాష్ట్ర ఎంపీ.. పైగా అధికార పార్టీ ఎంపీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉన్న ఎంపీని ఏపీ రాష్ట్ర పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి కొట్టిన తీరు చూసి దేశమే షాక్ అవుతున్న పరిస్థితి. ఎంపీనే అలా బొబ్బలు వచ్చేలా కొడితే ఇక సామాన్యుల సంగతేంటి? అన్న ప్రశ్న అందరి నుంచి వ్యక్తమవుతోంది. విచారణ పేరుతో ఒక ఎంపీని చావబాదిన ఏపీ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు […]

Written By: NARESH, Updated On : May 15, 2021 9:45 pm
Follow us on

ఒక రాష్ట్ర ఎంపీ.. పైగా అధికార పార్టీ ఎంపీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉన్న ఎంపీని ఏపీ రాష్ట్ర పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి కొట్టిన తీరు చూసి దేశమే షాక్ అవుతున్న పరిస్థితి. ఎంపీనే అలా బొబ్బలు వచ్చేలా కొడితే ఇక సామాన్యుల సంగతేంటి? అన్న ప్రశ్న అందరి నుంచి వ్యక్తమవుతోంది. విచారణ పేరుతో ఒక ఎంపీని చావబాదిన ఏపీ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించారని తెలిసింది. జగన్ ను తిట్టిన ఎంపీ రఘురామ కాళ్లపై పోలీసులు కొట్టారని.. అవి బొబ్బలు ఎక్కిన వైనం ఆయన మీడియాకు, జడ్జీలకు చూపించారు. దీనిపై తీవ్ర దుమారం రేపుతోంది.

తాజాగా ఈ ఘటనను అందరూ ఖండిస్తున్నారు. కోర్టు కూడా సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. ఎంపీ రఘురామపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయపడిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు చిత్రాలు కలతపెట్టేవిగా ఉన్నాయని వీటిని ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా రాష్ట్ర పోలీసులు వేధించగలిగితే, రాష్ట్రంలోని సాధారణ ప్రజల స్థితి ఏమిటి? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ దారుణానికి కారణమైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం.. రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి రాజకీయ క్రూరత్వాన్ని చూపించడం అప్రజాస్వామికం అన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

వైసీపీ ప్రభుత్వం తన ప్రతీకార చర్యలను ఆపి, ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజకీయంగా ప్రేరేపించిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. . ఏది ఏమైనా, న్యాయస్థానాల ద్వారా త్వరలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.