ఏపీ పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లకు తీపికబురు అందించింది. మొత్తం 291 వాలంటీర్ల ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పది, ఇంటర్ పాసై స్థానికులు అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మే 18వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా జిల్లా సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండటంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 18వ తేదీలోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 5,000 రూపాయలు గౌరవ వేతనం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తూ పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకునే వాళ్లకు వాలంటీర్ జాబ్ బెస్ట్ అని చెప్పవచ్చు.
ప్రభుత్వం గ్రామ, వార్డ్ వాలంటీర్ల వేతనాలను పెంచకపోయినప్పటికీ ఉగాది పండుగ రోజున ప్రోత్సాహకాల రూపంలో నగదును అందించింది. రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ వాలంటీర్ల వేతనం పెంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.