Indian National Flag: భారత దేశ చరిత్రలో ఆరు జెండాలు.. అవేంటో తెలుసా?

భారత దేశం 200 ఏళ్లు తెల్లవారి పాలనలో ఉంది. దాదాపు వందేళ్ల పాలన తర్వాత భారతీయులు స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో 1907, ఆగస్టు 7న కోల్‌కత్తాలో తొలిసారి జెండాను ఎగురవేశారు.

Written By: Raj Shekar, Updated On : January 28, 2024 2:08 pm
Follow us on

Indian National Flag: భారత దేశ జాతీయ పతాకం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది త్రివర్ణ పతాకం. ప్రస్తుతం ఉన్న రెండు, మూడు జనరేషన్ల వారికి ఇది మాత్రమే తెలుసు. కానీ, దీనికన్నా ముందు భారతదేశం ఐదు జెండాలు ఎగురవేసింది. అవన్నీ వేర్వేరుగా ఉన్నాయి. వాటికి ఆవిష్కరణకు ప్రత్యేక ఎజెండా కూడా ఉంది డిజైన్‌ కూడా వేరుగా ఉంటుంది. మరి మన జెండాలు వాటి వెనుక ఉన్న నేపథ్యం తెలుసుకుందాం.

1907లో తొలిసారి..
భారత దేశం 200 ఏళ్లు తెల్లవారి పాలనలో ఉంది. దాదాపు వందేళ్ల పాలన తర్వాత భారతీయులు స్వేచ్ఛ స్వాతంత్య్రం కోసం ఉద్యమం ప్రారంభించారు. ఈ క్రమంలో 1907, ఆగస్టు 7న కోల్‌కత్తాలో తొలిసారి జెండాను ఎగురవేశారు. ఈ జెండా ఆకుపచ్చ, పసుపు, కాషాయం రంగుల్లో ఉండేది. దీనిపై బెంగాల్‌ కవి బంకిం చంద్రచటర్జీ రాసిన వందేమాతరం అని రాసి ఉండేది.

1907లోనే మరో జెండా..
ఇక 1907 ఆగస్టులోనే మరో జెండాను ఎగురవేశారు. దీనిలో కాషాయం, పసుపు రంగు మాత్రమే ఉన్నాయి. ఈ జెండాను బికాజీ కామా ఆగస్టు 22న ఎగురవేశారు.

1917లో..
ఇక 1917లో మరో జెండా రూపొందించారు. ఇందులో బ్రిటిష్‌ జెండాతోపాటు ఆకుపచ్చ, ఎరుపు రంగుల గీతలతో దీనిని తయారు చేశారు. దీనిని డొమీనియన్‌ స్టేటస్‌ కోసం ఇండియా డిమాండ్‌ చేస్తున్న సమయంలో దీనిని ఎగురవేశారు.

1921లో..
ఇక నాలుగో జెండా 1921లో రూపొందించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ ఈ జెండాను రూపొందించింది. బెజవాడలో జరిగిన సమావేశంలో ఆంధ్రా యూత్‌ తయారు చేసిన ఈ జెండాను మహాత్మాగాంధీ ఈ జెండాను తొలిసారి ఎగురవేశారు. ఈ జెండాలో మూడు రంగులు ఉండేవి. పైన తెలుపు, మధ్యలో ముదురు ఆకుపచ్చ, దిగువన కాషాయ రంగులతో రూపొందించారు. మధ్యలో రాట్నం ముద్రించారు.

1931లో..
ఇక స్వాతంత్య్ర ఉద్యమం మరింత ఉధృతం అయిన సమయంలో జెండా ఆవశ్యకత పెరిగింది. ఈ నేపథ్యంలో 1921లో తయారు చేసిన జెండాలో స్వల్ప మార్పులు చేసి మరోసారి ఎగురవేశారు. ఈ జెండాలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకుపచ్చ రంగు ఉండగా, మధ్యలో రాట్నం ముద్రించారు.

స్వాతంత్య్రానికి కొద్ది రోజుల ముందు..
ఇక స్వాతంత్య్రం రావడానికి కొద్ది రోజుల ముందు జెండాలో మరికొంత మార్పు చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించారు. ఇందులో కూడా మూడు రంగులు ఉన్నాయి. పైన కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకుపచ్చరంగుతోపాటు మధ్యలో రాట్నం స్థానంలో అశోక చక్రం చేశారు. దీనిని తొలిసారి 1948, జూలై 22న ఎగురవేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మన జాతీయ జెండాగా ఉంది.