Taraka Ratna : తారకరత్న పెద్దకర్మ కార్డు.. చూడగానే ఆశ్చర్యం అనిపించింది.. మార్చి 2న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సంస్మరణ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కానీ ఇందుకు సంబంధించిన కార్డులో ఒక వైపు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, ఆమె పిల్లలు.. మరో వైపు బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి ఎన్టీఆర్ కుటుంబం నుంచి పేరు కనిపించలేదు. లేదు అంతే! తారకరత్న మరణం తర్వాత కూడా అతని తల్లిదండ్రుల మనసు కరగడం లేదా? ప్రేమించి పెళ్లి చేసుకోవడమేనా అతడు చేసిన తప్పు? సమాజంలో ఎంతమంది కమ్మ, రెడ్డి కులస్తులు పెళ్లి చేసుకోవడం లేదు? పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది కలిసిపోవడం లేదు? చట్టంతో కొడుకును కోల్పోయిన తర్వాత కూడా ఆ పంతాలు, పెద్ద కర్మకూ అడ్డువస్తున్నాయా? తెల్లారి లేస్తే సమాజానికి బోలెడు నీతులు చెప్పే దగ్గుబాటి పురందేశ్వరి, భువనేశ్వరి, తదితరుల స్టాండ్ ఏమిటి? తారకరత్న తండ్రి స్టాండ్ నే వారూ కొనసాగిస్తున్నారా? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడమేనా అలేఖ్య రెడ్డి చేసిన పాపం? ఇందులో తప్పు పట్టేందుకు ఏముంది? అంటే కమ్మవాళ్ళు కమ్మ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా? రెడ్డి కులస్తులను ప్రేమిస్తే వాళ్లు ఇంటి కోడలుగా పనికిరారా? ఆ పిల్లలు చేసిన పాపం ఏముంది? చూస్తుంటేనే ముద్దు ముద్దుగా ఉన్నారు? వారు అలా గుక్క పెట్టి ఏడుస్తుంటే కరగని మనసు ఓ మనసేనా?
తారకరత్న మరణించిన తర్వాత అతడి తండ్రి కనీసం కోడల్ని, ఆమె పిల్లల్ని పలకరించలేదు. కనీసం ఆమె ముఖం వైపు కూడా చూడలేదు. కొంతలో కొంత ఆ బ్లడ్ బ్రీడ్ బాలయ్య నయం. తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు బెంగుళూరు వెళ్ళాడు. అక్కడే కొద్ది రోజులు ఉన్నాడు. తారకరత్న కన్ను మూసిన తర్వాత బెంగళూరు నుంచి అంత్యక్రియల వరకు అన్నీ తానై వ్యవహరించాడు. అంతేకాదు తారకరత్న పిల్లల బాధ్యతను తీసుకుంటా అని హామీ ఇచ్చాడు. ఇటీవల తారకరత్న చిన్న కర్మ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తప్ప నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారని ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదో తెలియదు కానీ.. తారకరత్న తల్లిదండ్రులు వచ్చారు. వెళ్లారు. కానీ ఆలయ రెడ్డిని గాని, ఆమె పిల్లల్ని గాని పరామర్శించలేదు.
తారకరత్నకు గొప్ప పరివారం ఉంది. ఘనమైన వారసత్వం ఉంది. కాఠినాత్ములైన తల్లిదండ్రుల కారణంగా, ప్రేమను ఇన్నేళ్లయినా అంగీకరించలేని వాళ్ళ పంతాల కారణంగా భిన్నంగా బతికాడు. నమ్మి వచ్చిన అమ్మాయి కోసం చివరి వరకు తోడుగా ఉన్నాడు. కారులో నిద్రించాడు. చేతిలో రూపాయి లేకుండా బతికాడు. ఆమెను ప్రాణప్రదంగా ప్రేమించాడు. అలేఖ్య రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో కూడా ఇలా చెప్పుకుంటూ బాధపడింది.. అది చదువుతుంటే హృదయం ద్రవించింది. కానీ తారకరత్న తల్లిదండ్రులకే పంతం అడ్డొస్తోంది.. చెట్టంత కొడుకు కన్నుమూసినా ఇంకా ఈ కుల కంపు ఏమిటో? సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినదించిన వ్యక్తి కుటుంబంలో ఇంతటి కుల పట్టింపులు ఉంటాయా? నిజంగా పిటీ ఇది.