Homeజాతీయ వార్తలుHindu Population: తగ్గుతున్న హిందువుల జనాభా.. ఏం జరుగుతోంది

Hindu Population: తగ్గుతున్న హిందువుల జనాభా.. ఏం జరుగుతోంది

Hindu population: భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందా.. అంటే అవుననే అంటున్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) తెలిపింది. 1950లో మన దేశంలో హిందువులు దేశ జనాభాలో 84.68 శాతం ఉండగా, 2015 నాటికి ఇది 78.06 శాతానికి క్షీణించిందని వెల్లడించింది. అంటే హిందువుల వాటా జనాభాలో 7.82 శాతం తగ్గిందని పేర్కొంది.

పెరిగిన ముస్లింలు..
ఇదే సమయంలో భారత దేశ జనాభాలో ముస్లింల శాతం పెరిగింది. 1950 భారత జనాభాలో 9.84 శాతం ఉన్న ముస్లిం జనాభా.. 2015 నాటికి 14.09 శాతం పెరిగినట్లు పేర్కొంది. ముస్లిం జనాభాలో పెరుగుదల పరిశీలిస్తే 43.15 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఇక 1950–2015 మధ్య క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని తెలిపింది. జైనులు, పార్శీల శాతం తగ్గిందని వెల్లడిచింది. సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని అభిప్రాయపడింది.

మార్పులకు కారణాలు..
ఇక జనాభా హెచ్చుతగ్గుల్లో మార్పులకు కొన్ని కారణాలను సలహా మండలి స్పష్టం చేసింది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియలు సమాజంలో జనాభా హెచ్చు తగ్గులకు కారణమవుతాయని తెలిపింది. శామికా రవి నేతృత్వంలోని ఈఏసీ–పీఎం ప్రపంచ వ్యాప్తంగా 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈమేరకు నివేదికను రూపొందించింది. ఆయా వర్గాల జనాభా నిర్ధిష్టంగా ఎంద ఉందన్నది మాత్రం నివేదికలో పేర్కొనలేదు.

పొరుగు దేశాల్లో మెజారిటీ మతస్థుల పెరుగుదల..
తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్గానిస్థాన్‌ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం ఆయా దేశాల్లోని మెజారిటీ మతస్థుల జనాభా శాతం పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. మైనార్టీల వాటా గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. 1950–2015 మధ్య మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లోనూ మెజార్టీ వర్గం ప్రజల వాటా పెరిగింది. మాల్దీవుల్లో మెజార్టీ వర్గంగా ఉన్న షఫీ సున్నీల వాట 1.47 శాతం తగ్గింది. బంగ్లాదేశ్‌లో మెజార్టీ మతస్తుల వాటా 18 శాతం పెరిగింది. భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల. మన దాయాది దేశం పాకిస్థాన్‌లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాటా 3.75 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా ఆదేశ జనాభాలో ముస్లింల వాటా పరంగా పెరుగుదల 10 శాతం నమోదైంది. ముస్లిమేతరులు మెజారిటీ వర్గాలుగా ఉన్న దేశాల్లో మయన్మార్, భారత్, నేపాల్‌లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా తగ్గిందని పేర్కొంది. ఇక అధిక ఆదాయం ఉన్న 35 దశాల్లో మెజార్టీ మతస్థుల వాటా సగటున 29 శాతం క్షీణించింది. ప్రపంచ సగటు(22శాతం)తో పోలిస్తే ఇది ఎక్కువ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version