https://oktelugu.com/

Thailand: ఆఫర్‌.. వీసా లేకుండా మరో ఆరు నెలలు అనుమతి..!

థాయిలాండ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు 2023, నవంబర్‌ 10న తొలిసారి అనుమతి ఇచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 10, 2024 / 12:30 PM IST

    Thailand

    Follow us on

    Thailand: థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు శుభవార్త. పర్యాటక వీసా లేకుండానే రావడానికి ఆ దేశ ప్రభుత్వం మరో ఆరు నెలలు అవకాశం కల్పించింది. ఈమేరకు థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా లేకండానే సాధారణ పాస్‌పోర్టు ఉన్నవారు థాయిలాండ్‌లో గరిష్టంగా 30 రోజులు పర్యటించవచ్చు.

    పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు..
    థాయిలాండ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు 2023, నవంబర్‌ 10న తొలిసారి అనుమతి ఇచ్చింది. ఈ గడువు 2024, మే 10 వరకు ఉంటుందని పేర్కొంది. శుక్రవారంతో గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

    సత్ఫలితాలు రావడంతో..
    మొదట ఇచ్చిన అవకాశంతో థాయిలాండ్‌కు సత్ఫలితాలు వచ్చాయి. ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు పెరిగారు. దీంతో గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని రాయల్‌ థాయ్‌ క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ గడువు 2024, నవంబర్‌ 11 వరకు ఉంటుందని పేర్కొంది. భారత్, తైవాన్‌ పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. థాయిలాండ్‌లో రాజధాని బ్యాంకాక్‌.. చయాంగ్‌ మాయ్‌తోపాటు అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

    నాలుగు గంటల ప్రయాణం..
    భారత్‌ నుంచి థాయిలాండ్‌ వెళ్లడానికి 4 గంటల సమయం పడుతుంది. దీని ప్రకృతి అందాలతో అగ్ర పర్యాటక ప్రదేశాల్లో థాయిలాండ్‌ ఒకటి. ఈ దేశాన్ని ది ల్యాండ్‌ ఆఫ్‌ స్మైల్స్‌ అని పిలుస్తారు. థాయిలాండ్‌ ఉష్ణమండల దేశం. ఏడాది పొడవునా ష్ణోగ్రత ఉంటుంది. థాయిలాండ్‌ను సందర్శిచడానికి వసంతకాలం అనుకూలం. అంటే మార్చి నుంచి మే వరకు ఉత్తమ సమయం. ఈ సమమయంలో ఆదేశంలో ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటాయి.