https://oktelugu.com/

Flexicap Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారా? ముందుగా ‘ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్’ గురించి తెలుసుకోండి..

ఇండియన్ మ్యూచ్ వల్ ఫండ్ మార్కెట్లో ఇటీవల బాగా వినిపిస్తుున్న పేరు ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్’. ఇందులో పెట్టుబడులు అస్థిరతకు లోను కాకుండా ఉంటాయి. చిన్న, పెద్ద, మధ్య తరహా కంపెనీలకు వీటి ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2024 / 12:21 PM IST

    Flexxi cap fund

    Follow us on

    Flexicap Funds:  నేటి కాలంలో ఇన్వెస్ట్ మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలని చాలా మంది చెబుతున్నారు. మార్కెట్లో ఉన్న లాభ, నష్టాలతో సంబంధం లేకుండా చిన్నపాటి మొత్తాలతో లాభాలను ఆర్జించవచ్చు. అయితే చిన్న మొత్తాల లాభాలు కావాలన్నా కొన్ని సంవత్సరాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ సమయం తీసుకున్నా ఒక్కోసారి లాభం కంటే నష్టాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఎలాంటి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అని కొందరికి సందేహం ఉంటుంది. కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్’  పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్యూరిటీ తో పాటు లాభాలు ఉండే అవకాశం ఉంది. అ వివరాల్లోకి వెళితే..

    ఇండియన్ మ్యూచ్ వల్ ఫండ్ మార్కెట్లో ఇటీవల బాగా వినిపిస్తుున్న పేరు ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్’. ఇందులో పెట్టుబడులు అస్థిరతకు లోను కాకుండా ఉంటాయి. చిన్న, పెద్ద, మధ్య తరహా కంపెనీలకు వీటి ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ మార్కెట్ సూచిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. మార్కెట్ పరిస్థితులు, మదింపు స్థాయిలు తదితర విషయాలను ఫండ్ మేనేజరింగ్ తో సంబంధం లేకుండా అత్యుత్తమ కంపెనీల్లో పెట్టుబడులను పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది.

    మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు లార్చ్ క్యాప్ లేదా మిడల్ క్యాప్ గురించి ఆలోచిస్తారు. కానీ ప్లెక్సీ క్యాప్ ఫండ్స్ మార్కెట్ లోని నిర్దిష్ట పరిమాణంలో పెట్టుబడులు పెట్టడానికి సాయం చేస్తుంది. ఇలా చేయడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇవి మేనేజర్ ల ఫోర్ట్ ఫోలియోను మెరుగైన వృద్ధి అవకాశాలు ఉండేలా చేస్తాయి. ఏవో కొన్ని విభాగాలకు కాకుండా మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా కేటాయింపులు చేసుకోవచ్చు.

    ఫ్లెక్సీ మ్యూచుఫల్ ఫండ్స్ లో పెట్టుబడి నిర్ణయాలు నైపుణ్యంగా ఉంటాయి. ఆశాజనకమైన వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేసే విధంగా వీలు కల్పిస్తారు. ప్రత్యేకించి కొన్ని మెరుగ్గా పనిచేసే వాటి గురించి మాత్రమే ఇవి తెలియజేస్తాయి. మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను మార్చుకోవడానికి దారి చూపిస్తాయి.

    అయితే ఫ్లెక్సీ క్యాప్ పండ్ గురించి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులోనూ నష్టాలు లేకపోలేదు. ఎలాంటి సందర్భాల్లో నష్టాలు ఉంటాయో ముందే తెలుసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఫండ్ కేటాయింపుల గురించి ముందే తెలుసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. ఫండ్ పథకాల కింద ఉనన నికర ఆస్తి విలువ వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల విషయంలో సెక్యూరిటీలపై ఆధారపడుతాయి. ఇవి ఒక్కోసారి తగ్గొచ్చు. పెరుగొచ్చచ్చు. అందువల్ల నిర్దిష్ట పెట్టుబడులను అర్థం చేసుకోవడానికి నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.