Himanta Biswa Sarma: మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్కడి ప్రజలు అక్రమంగా మనదేశంలోకి దశాబ్దాలుగా చొరబడుతూనే ఉన్నారు. ఆయా దేశాల్లో ఉపాధి లేకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. అభివృద్ధి లేకపోవడంతో చాలా మంది సరిహద్దులు దాటి భారత్‌లోకి వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారు.. ఇప్పుడు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మైనారిటీ పేరుతో దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు. దేశ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అస్సాంలో ముఖ్యమంత్రి హింత బిస్వశర్మ ప్రభుత్వం.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
లక్షల ఎకరాలు కబ్జా..
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వశర్మ 2021 బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన బంగ్లాదేశీయుల వలసలపై దృష్టిపెట్టారు. బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడి వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. ప్రభుత్వ, అటవీ, గ్రేసింగ్ రిజర్వు భూములు, బ్రహ్మపుత్ర నది దీవులు, చారిత్రక మత కేంద్రాలను బంగ్లాదేశీయుల కబ్జాలో ఉన్నాయి. వీటిని తిరిగి స్వాధీనం చేసుకునేలా ఏడాది పొడవునా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో 1,19,548 బిగాల భూములు విడిపించారు.
కీలక జిల్లాల్లో పెద్ద ఆపరేషన్లు
బొగిగాం, మాజూలీ (ప్రపంచంలోని అతిపెద్ద నదీద్వీపం), డూబ్రీ, నౌగాం, బొజాలీలో 15 వేల ఎకరాలు విముక్తి చేశారు. జోర్‌హాట్‌లో ‘ఢాకా పట్టి’ వంటి గ్రామాల్లో, డూబ్రీలో 1150 ఎకరాలు, గ్వాల్‌పారాలో 140 హెక్టార్ల అటవీ భూములు తిరిగి పొందారు. రేన్‌మయి, శ్రీభూమి జిల్లాల్లో కూడా ఇళ్లు, మసీదులు కూల్చి చొరబాటు దారులు పూర్తి చేశారు.
వేల ఎకరాలకు విముక్తి..
జూన్ నెలలోనే బొగేగాం, మాజులి(ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం), డూబ్రి జిల్లా, బంగ్లాదేశ్‌కు కేవలం 13 కిమీ దూరంలో ఉంటుంది. నౌగాం, బొజాలీ, కామ్రూట్ తదితర జిల్లాలో ముస్లింలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ 15 వేల ఎకరాల భూమిని బంగ్లాదేశీయుల నుంచి విడిపించారు. జూన్ 3న జోర్‌హాట్ ప్రాంతంలో ఆజాద్ చౌదరి అనే బంగ్లాదేశీ ముస్లిం నాయకత్వంలో బంగ్లాదేశీయులు వందల ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. దాని పేరు ఢాకా పట్టీ. దానిని కూడా విముక్తి చేశారు. జూలై 8న డూబ్రిలో 1150 ఎకరాలు విముక్తి చేశారు. 1400 ఇళ్లు ధ్వంసం చేశారు. జూలై 3న బంగ్లాదేశీయులకు చెందిన 300 ఇళ్లు కూల్చారు. ఇవి పశువుల కోసం కేటాంచిన భూములు, 12వ తేదీన గ్వాల్‌పారా జిల్లాలో ఉన్న పైకన్ ఫారెస్ట్‌లో 140 హెక్టార్ల భూములు విముక్తి చేశారు. అందులో ఇళ్లు, కొట్టాలు, మసీదులు, మదరసాలు ఉన్నాయి.
చొరబాటు వ్యతిరేక ప్రణాళిక..
ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రెజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అమలుతో చొరబాటుదారులను గుర్తించి బంగ్లాదేశ్‌కు పంపిస్తున్నారు. నవంబర్‌లో 376 ఎకరాలు, డిసెంబర్‌లో 38 బిగాలు విముక్తి, 200 మంది చోరలు రిపాట్రియేటెడ్. స్మగ్లింగ్ హాట్‌స్పాట్‌లలో పోలీసు, సైన్య సహకారంతో తిరుగుబాటులను అణచివేస్తున్నారు.
ఈ ఆపరేషన్ దేశంలోనే అసూయ కలిగించే విస్తృత చర్యగా నిలిచింది. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రంలో భూమి రక్షణ రాజకీయ ఆయుధంగా మారింది. మైనారిటీ ఓటు బ్యాంకులపై ప్రభావం చూపుతూ, జాతీయ భద్రతా సమస్యలకు దృష్టి సారించింది. హిమంత పాలిసీ రాష్ట్రవాసుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.