https://oktelugu.com/

టీడీపీ గతే వైసీపీకి పడుతుందా?

రాజకీయాల్లో కులమే బలం అవుతోందా..? కులం, రాజకీయం ఎప్పుడూ అన్నదమ్ముల్లాగే కలిసి ఉంటాయా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కులం లేనిదే రాజకీయాలు లేవు అన్నట్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏపీ రాజకీయాలు అన్నీ కులం రాజకీయాలే ఎజెండాగా నడుస్తుంటాయి. అక్కడ గతంలో అధికారంలో చంద్రబాబు కూడా ఈ కుల రాజకీయాలతోనే పదవి వదులుకోవాల్సి వచ్చిందా..? Also Read: మీడియాకు సంకెళ్లా? స్వామి భక్తిపై హైకోర్టు ఆగ్రహం? గతంలో టీడీపీ చేసిన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 2:25 pm
    ycp flag

    ap ycp flag

    Follow us on

    ycp flagరాజకీయాల్లో కులమే బలం అవుతోందా..? కులం, రాజకీయం ఎప్పుడూ అన్నదమ్ముల్లాగే కలిసి ఉంటాయా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కులం లేనిదే రాజకీయాలు లేవు అన్నట్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏపీ రాజకీయాలు అన్నీ కులం రాజకీయాలే ఎజెండాగా నడుస్తుంటాయి. అక్కడ గతంలో అధికారంలో చంద్రబాబు కూడా ఈ కుల రాజకీయాలతోనే పదవి వదులుకోవాల్సి వచ్చిందా..?

    Also Read: మీడియాకు సంకెళ్లా? స్వామి భక్తిపై హైకోర్టు ఆగ్రహం?

    గతంలో టీడీపీ చేసిన కుల తప్పిదాలే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి సీఎం జగన్‌ క్రిస్టియనిటీని ఎక్కువగా నమ్ముతారనే ప్రచారం ఉంది.. ఆయన అధికారంలోకి వచ్చాక హిందు ఆలయాలను పట్టించుకోవడం లేదని.. అన్యమత ప్రచారానికి మద్దతు ఇస్తున్నారంటూ చాలా వరకు విమర్శలు వచ్చాయి. తాజాగా అంతర్వేది ఘటన కూడా ఏ స్థాయిలో మంటలు రేపిందో అందరికీ తెలిసిందే.

    అయితే.. వీటికి తోడు ఇటీవల దళితుడి శిరోముండనం కూడా జగన్‌కు వ్యతిరేకతను తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇసుక దందాకు అడ్డొచ్చాడని దళిత యువకుడు వరప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌ శిరోముండనం చేసి చావగొట్టారని మీడియాలో వార్తలు హైలెట్ అయ్యాయి. రాష్ట్రపతి దాకా వ్యవహారం వెళ్లింది.. దీంతో గతంలో బాబు చేసిన తప్పిదాలనే జగన్‌ కూడా రిపీట్‌ చేస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీ వారు విమర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికార గర్వంతో ‘దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే బాబును అడ్రస్‌ లేకుండా చేశాయనేది రాజకీయ వర్గాల్లో టాక్‌..

    Also Read: అంతర్వేది బీజేపీకి ఓటు బ్యాంకుల మారనుందా..?

    రాష్ట్రంలో 39 లక్షల మంది వరకు దళితులు ఉన్నారని ఆ వర్గం చెప్పుకుంటోంది. మరి ఇంత ఓటు బ్యాంకు ఉన్న మాదిగల పట్ల జగన్ చేస్తున్నదేంటి..? ఓ వైపు టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ జగన్‌ ప్రభుత్వం అలా చేస్తోంది.. ఇలా చేస్తోంది.. ఆ కులాల వారిని ఇలా హింసిస్తోంది.. ఈ కులాల వారికే మద్దతునిస్తోందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే వీటిని విన్న జగన్‌ ప్రభుత్వం కూడా అందులోని లొసుగులను తెలుసుకోవాల్సి ఉంది. ఆ విమర్శలను తిప్పికొట్టేలా సదరు వర్గం వారిని ఏదో విధంగా ఆదుకోవడమా.. వారికి ఏదైనా తోవ చూపడమా చేయాల్సి ఉంటుంది. కానీ.. అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో చంద్రబాబు నాటి పరిస్థితులను గుర్తుచేస్తున్నట్లుగా తెలుస్తోంది.