https://oktelugu.com/

జగన్ సర్కార్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మరోసారి హైకోర్టు వర్సెస్‌ జగన్ సర్కార్‌ గా‌ పరిస్థితులు మారాయి. దీనికితోడు హైకోర్టుకు కూడా జగన్‌కు సహకరించేలా లేడు. ఇప్పటికే చాలా పిటిషన్లపై ఎదురుదెబ్బ తిన్న జగన్‌ సర్కార్‌‌పై మరోసారి ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఇటీవలే ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌… తనకు‌ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈసీ వినతులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 08:55 AM IST
    Follow us on

    ఏపీలో మరోసారి హైకోర్టు వర్సెస్‌ జగన్ సర్కార్‌ గా‌ పరిస్థితులు మారాయి. దీనికితోడు హైకోర్టుకు కూడా జగన్‌కు సహకరించేలా లేడు. ఇప్పటికే చాలా పిటిషన్లపై ఎదురుదెబ్బ తిన్న జగన్‌ సర్కార్‌‌పై మరోసారి ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇటీవలే ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌… తనకు‌ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈసీ వినతులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి సీఈసీగా రావడంతో.. ప్రభుత్వం నాన్ కో ఆపరేటివ్‌గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు మారుతాయి.. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని.. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.

    Also Read: కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నా ఆగని పోలవరం పనులు

    తాజాగా రాజధాని బిల్లులపై పిటీషన్ ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రాజధాని బిల్లులను ఆమోదించలేదని శాసనమండలి రద్దుకు సిఫార్సు చేశారు. ఎన్నికల కమిషనర్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు.ఇప్పుడు మూడో లక్ష్యం హైకోర్టు. ఇదేం పద్ధతి’ అంటూ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
    జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై తీవ్రంగా స్పందించింది. ఏపీలో పరిస్థితులు అదుపులో లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

    ఇక సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదని.. ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందో లేదో నిర్ణయిస్తాం’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

    Also Read: బాబు దృష్టిలో పవన్ కళ్యాణ్‌ కూడా విలనే..

    ఈ మధ్యకాలంలో సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.