Site icon OkTelugu

తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,607 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,48,891 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,372గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,27,583 మంది కోలుకోగా ప్రస్తుతం 19,936 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 17,134 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 296 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా రికవరీ రేటు 91.43 శాతంగా ఉంది.

Exit mobile version