దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీలు చదివి కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఆ స్థాయిలో దేశంలో ఉద్యోగాలు లేకపోవడంతో అర్హతకు తగిన ఉద్యోగం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు విడుదలవుతున్న నోటిఫికేషన్ల గురించి సరైన అవగాహన పెంచుకుంటే మాత్రం సులభంగా ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది.
తాజాగా రైల్వే శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్)లో 170 ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 170 ఉద్యోగాల భర్తీ జరగనుంది. https://rites.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ నెల 26వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఇతర కంపెనీల్లో పని చేసి అనుభవం సాధించిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 170 ఉద్యోగాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు 90 కాగా సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు 50 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు 30 ఉన్నాయి.
కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకు 35 శాతం, అనుభవానికి 5 శాతం ప్రాధాన్యత ఉంటుంది.