వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశం

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. Also Read: మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు ఇక స్టే విధించగా దాన్ని ఎత్తి వేసి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు […]

Written By: NARESH, Updated On : December 17, 2020 7:41 pm
Follow us on

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్ వేర్ లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Also Read: మోడీ సర్కార్ కు షాక్.. వ్యవసాయ చట్టాల అమలు ఆపాలన్న సుప్రీంకోర్టు

ఇక స్టే విధించగా దాన్ని ఎత్తి వేసి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని.. రిజిస్ట్రేషన్ అధికారులు ఆధార్ వివరాలు మాత్రం అడగవద్దని స్పష్టం చేసింది.

ఎలాంటి చట్టం లేకుండా ధరణి వెబ్ సైట్ లో ఆస్తుల నమోదుతోపాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు సాకేత్, గోపాల్ శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Also Read: ఏపీలో స్థానిక ఎన్నికలపై జగన్ సర్కార్ కు ఎస్ఈసీ ట్విస్ట్

ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించమని స్పష్టం చేసింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన తెలిపింది.

సాఫ్ట్ వేర్, మ్యానువల్ ల్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 28కి  వాయిదా వేసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్