https://oktelugu.com/

జనవరి రిపోర్ట్ : ఒకే ఒక్క హిట్ మిగిలిన‌వ‌న్నీ ఫ్లాపులే !

2021కి సినిమాలు ఘ‌నంగానే హార‌తులు పట్టి.. సంక్రాంతి సీజ‌న్ పుణ్యమా అని క్రాక్‌, మాస్ట‌ర్‌, అల్లుడు అదుర్స్‌, రెడ్ అనే నాలుగు సంక్రాంతి పుంజులు పోటీలో దిగాయి. ఐతే క్రాక్ మాత్ర‌మే నిల‌బ‌డింది ఆ పోటీలో. 50 శాతం సిట్టింగ్ ఆక్యుపెన్సీలోనూ 30 కోట్ల‌కు పైగా కలెక్షన్స్ సాధించి యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 2, 2021 11:12 am
    Follow us on

    Krack Movie
    2021కి సినిమాలు ఘ‌నంగానే హార‌తులు పట్టి.. సంక్రాంతి సీజ‌న్ పుణ్యమా అని క్రాక్‌, మాస్ట‌ర్‌, అల్లుడు అదుర్స్‌, రెడ్ అనే నాలుగు సంక్రాంతి పుంజులు పోటీలో దిగాయి. ఐతే క్రాక్ మాత్ర‌మే నిల‌బ‌డింది ఆ పోటీలో. 50 శాతం సిట్టింగ్ ఆక్యుపెన్సీలోనూ 30 కోట్ల‌కు పైగా కలెక్షన్స్ సాధించి యునానిమస్ హిట్ ‌గా నిలిచి.. మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ కు బాగా కనెక్ట్ అయింది. వరుస ఎలివేషన్ సీన్లతో గోపీచంద్ మలినేని, రవితేజను బాగానే డీల్ చేశాడు. దాంతో ‘క్రాక్’ హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పటికి కలెక్షన్స్ సాధిస్తూ లాభాల బాటలో సాగుతుంది.

    Also Read: ఎట్టకేలకు పట్టాలెక్కుతున్న నాగ్ ‘బంగార్రాజు’

    అలాగే అంచనాలతో వచ్చిన మరో సంక్రాంతి పుంజు రెడ్. రెడ్ కి మొదటి షో నుండి డివైడ్ టాక్ వ‌చ్చినా, సంక్రాంతి సీజ‌న్ కావడంతో సినిమాలకు అప్పటికీ చాల గ్యాప్ రావడంతో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకుని.. పోటీలో గెలవలేకపోయినా ఓటమి నుండి తప్పించుకుంది. ఇక అల్లుడు అదుర్స్ కి పోటీలో నిలిచే అర్హత లేదు అన్నట్టు ఉంది ఆ సినిమా పరిస్థితి. పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. సంక్రాంతి సీజ‌న్ త‌ర‌వాత చిన్న సినిమాలు ఎక్కువే వ‌చ్చినా.. వాటిలో చెప్పుకోద‌గ‌న‌వి మాత్రం బంగారు బుల్లోడు, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా లాంటి సినిమాలు.

    Also Read: బ్రహ్మానందం పుట్టిన రోజు ప్రత్యేక స్టోరీ

    ఆనవాయితీ ప్రకారం అల్లరి న‌రేష్ మ‌రో పెద్ద ఫ్లాపు కొట్టి .. ఉన్న మార్కెట్ కి కూడా మళ్ళీ డ్యామేజ్ చేసుకున్నాడు. క‌థ‌లో, క‌థ‌నంలో ఏమాత్రం కొత్త‌ద‌నం చూపించ‌ని న‌రేష్ సినిమాలు ఓవరాల్ గా ప్లాప్ లకు పర్యాయ పదాలుగా మారాయి. ఇక ప్ర‌దీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా 30 రోజుల్లో అనే సినిమాలో మ్యాటర్ లేకపోయినా .. క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. కేవలం నీలీ నీలీ ఆకాశం అంటూ సాగిన ఒక్క పాట వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. మొత్తంగా టాలీవుడ్ మూవీల జనవరి రిపోర్ట్ ప్రకారం టాలీవుడ్ వ‌సూళ్ల రూపంలో సాధించేం లేదు. ఈ నెల‌లో ద‌క్కింది ఒకే ఒక్క హిట్. మిగిలిన‌వ‌న్నీ ఫ్లాపులే. సంక్రాంతి సీజ‌న్ వ‌ల్ల‌.. రెడ్ సినిమా గ‌ట్టెక్కింది గానీ, లేదంటే… అదీ డిజాస్ట‌ర్‌ లిస్టులో చేరిపోవాల్సిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.