ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి ఫైర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమరావతి అభివృద్ధి కోసం వేల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు తరలిస్తామనడం ప్రభుత్వం మతిలేని చర్య కాదా అని ప్రశ్నించింది. రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి.. ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: తిరుపతిలో కూడా పవన్ త్యాగశీలి అవుతాడా?
ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ నిధులన్నీ ప్రజలవేనని.. పనులు నిలిపివేయడంతో చివరగా బాధపడేది ప్రజలేనని వ్యాఖ్యానించింది. రాజధాని ప్రాంతంలో భవనాలు నిర్మించి ఎక్కడి వాటిని అక్కడే వదిలేశారని విమర్శించింది. ఇప్పటివరకు ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు, ప్రభుత్వానికి జరిగిన నష్టమా.. కాదా అని ప్రశ్నించింది.
నిబంధనలు పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన మతిలేని చర్య కాదా అని నిలదీసింది. పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకొని వ్యక్తులను కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కాగా.. ఆ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Also Read: తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ చీకటి ఒప్పందం
ప్రజాచైతన్య యాత్రకు పోలీసుల అనుమతితో విశాఖ వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేయడాన్ని, ప్రతిపక్షాలు చేపట్టే ర్యాలీలను, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన పిల్ మీద శుక్రవారం విచారణ జరిగింది. దీని విచారణలో భాగంగానే అమరావతిలో పనులు నిలిపివేయడాన్ని తప్పుబడుతూ నిలదీసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్