దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడే స్తంభించిపోవడంతో పేద, మధ్యతరగతి, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వలస కార్మికుల కష్టాలను చూసి సోనూసూద్ చలించిపోయాడు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు సోనూసుద్ తనవంతు సాయమందించి అందరిచేత ప్రశంసలను అందుకున్నాడు.
Also Read: పూరి మ్యూజింగ్స్.. అది భారతకే సొంతం అంటున్న పూరి..!
లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా సోనూసుద్ చాలామందికి సాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. సోనూసుద్ కరోనా టైంలో చేసిన సేవలను చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు, నెటిజన్లు కొనియాడారు. ప్రస్తుతం సోనూసుద్ టాలీవుడ్లోని పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ‘అల్లుడు అదుర్స్’ షూటింగులో పాల్గొనగా చిత్రబృందం అతడిని సన్మానించింది.
తాజాగా సోనూసుద్ ‘ఆచార్య’ షూటింగులో పాల్గొన్నాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో సోనూసుద్ ను దర్శకుడు కొరటాల శివ.. నటుడు తనికెళ్ల భరణి సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందించి మీరు చేస్తున్న పని ప్రపంచమంతా విస్తరించాలని ఆకాంక్ష వెలిబుచ్చారు.
Also Read: బిగ్ బాస్-4: కెప్టెన్ గా ఎంపికైన హరిక.. అఖిల్.. మొనాల్.. సొహెల్ కు దెబ్బ..!
సోనూసుద్ ‘ఆచార్య’లో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్స్ చేస్తుండగా రాంచరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య’కు అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్