హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా

మాయదారి కరోనా మరోసారి తెలంగాణను భయపెడుతోంది. ఇప్పటికే మహమ్మారి దెబ్బకు చాలా దెబ్బతిన్న రాష్ట్రం ఇప్పుడు బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వైరస్ కు బాధితురాలిగా మారింది. తెలంగాణకు బ్రిటన్ నుంచి వచ్చిన వారి లెక్కతీసి పరీక్షలు చేయగా 16మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. తెలంగాణకు కూడా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. Also Read: హైదరాబాద్‌లో ‘కొత్త’ టెన్షన్‌ డిసెంబర్ 9 […]

Written By: NARESH, Updated On : December 26, 2020 8:08 pm
Follow us on

మాయదారి కరోనా మరోసారి తెలంగాణను భయపెడుతోంది. ఇప్పటికే మహమ్మారి దెబ్బకు చాలా దెబ్బతిన్న రాష్ట్రం ఇప్పుడు బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వైరస్ కు బాధితురాలిగా మారింది. తెలంగాణకు బ్రిటన్ నుంచి వచ్చిన వారి లెక్కతీసి పరీక్షలు చేయగా 16మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. తెలంగాణకు కూడా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: హైదరాబాద్‌లో ‘కొత్త’ టెన్షన్‌

డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 1200 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వీరిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 16మందిని గుర్తించి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు , జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్ జిల్లా ఒక్కొక్కరు పాజిటివ్ గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. 16మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 16మందికి 76మంది అతి సన్నిహితంగా ఉన్నారని గుర్తించారు. 16 మందిలో ఉన్న వైరస్ జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి పంపించామని.. మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు.

Also Read: గ్రేటర్లో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ..!

డిసెంబర్ 9 తరువాత రాష్ట్రానికి నేరుగా యూకే నుంచి వచ్చిన వారు లేదా యూకే గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్స్‌ఆప్ ద్వారా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని. సిబ్బంది వారి ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

తెలంగాణలో వీరిద్వారా రూపాంతరం చెందిన బలంగా మారిన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని.. అందరూ మాస్క్ లు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. కొత్త కరోనా వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్