టాలీవుడ్లో సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీతకు మంచి గుర్తింపు ఉంది. 15ఏళ్ల వయస్సులోనే టాలీవుడ్లోకి సునీత గాయనిగా ఎంట్రీ ఇచ్చింది. 19ఏళ్ల వయస్సులోనే సునీత మొదటి వివాహం జరిగింది.
అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సునీత భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు కుమారుడు ఆకాశ్.. కుమార్తె శ్రేయ ఉన్నారు. అయితే ఇటీవలే రెండో పెళ్లికి సిద్ధమైంది.
ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఇటీవలే కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో రామ్.. సునీత నిశ్చితార్థం జరిగింది.
ఈక్రమంలోనే సునీత-రామ్ కలిసి ఇటీవల సింగర్స్ యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. సుమ కనకాల ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు.
తాజాగా సినీ పరిశ్రమలోని ఇతర సెలెబ్రిటీలకు డిసెంబర్ 26న(శనివారం) భారీ ప్రీ వెడ్డింగ్ పార్టీని ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
రామ్-సునీత ప్రీ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం.. డిసెంబర్ 26 సాయంత్రం గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ పార్టీ జరగనుంది. సునిత-రామ్ లు టాలీవుడ్లోని సెలబ్రెటీలకు వరుస పార్టీలు ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.