బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. జనవరి నెలలో బ్యాంకు సెలవులివే..?

మరో ఆరు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల మేరకు కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురాబోతున్నాయి. ప్రతి నెలా ఇతర నెలలతో పోలిస్తే జనవరి నెలలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. నూతన సంవత్సరంతో పాటు హింధువులకు అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ ఉండటం, రిపబ్లిక్ డే సెలవులు ఉంటాయి. Also Read: రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. చేయకూడని తప్పులివే..? 2021 […]

Written By: Navya, Updated On : December 26, 2020 11:48 am
Follow us on


మరో ఆరు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల మేరకు కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురాబోతున్నాయి. ప్రతి నెలా ఇతర నెలలతో పోలిస్తే జనవరి నెలలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. నూతన సంవత్సరంతో పాటు హింధువులకు అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ ఉండటం, రిపబ్లిక్ డే సెలవులు ఉంటాయి.

Also Read: రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

2021 జనవరి నెలలో 31 రోజులకు గాను ఆర్బీఐ ప్రకటన ప్రకారం 8 రోజులు బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. ఈ సెలవులతో పాటు రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా సెలవు దినాలుగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో ముందుగానే ప్లాన్ చేసుకుంటే బ్యాంకు లావాదేవీల విషయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. న్యూ ఇయర్, పండుగ ఉండటంతో జనవరి నెలలో సాధారణంగా ఉండే ఖర్చులతో పోలిస్తే వచ్చే నెలలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.

Also Read: బీమా పాలసీలను తీసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

బ్యాంకులలో రుణాలు తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు సైతం బ్యాంకు సెలవుల గురించి అవగాహన ఏర్పరచుకుంటే మంచిది. ఆర్బీఐ తాజాగా జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను ప్రకటించింది. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా సెలవు కాగా జనవరి 2వ తేదీ కూడా కొత్త సంవత్సరం వేడుక సెలవుగా ఆర్బీఐ ప్రకటించింది. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 సెలవుగా ఉంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

జనవరి 15వ తేదీ తిరువల్లూవర్ డే / మాగ్ బిహు, జనవరి 16 ఉజవర్ తిరునాల్, నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23, ఇమోయిను ఇరత్పా సందర్భంగా జనవరి 25, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 సెలవు దినాలుగా ఉన్నాయి. అయితే రాష్ట్రాలను, పండుగలను బట్టి ఈ సెలవులలో స్వల్పంగా మార్పులు ఉంటాయి.