Hero Vishal- Pawan Kalyan And Jagan: టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు అందరికీ కావాలి..ఎందుకంటే ఇక్కడ ఒక సినిమాని ఆదరిస్తే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు ఆడియన్స్..ముఖ్యంగా తమిళ హీరోలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది..రజినీకాంత్ ,కమల్ హాసన్ ,సూర్య , కార్తీ వంటి హీరోలతో పాటుగా ఈమధ్య విజయ్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడింది..వీళ్ళతో పాటు ఒకప్పుడు హీరో విశాల్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ఉండేది..అతను నటించిన సినిమాలు ఇక్కడ చాలా వరకు హిట్ అయ్యాయి.

వాటిల్లో పందెం కోడి, పొగరు , భరణి మరియు అభిమన్యుడు వంటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన ‘లాఠీ’ అనే సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా విశాల్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న..నిన్ననే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తిరుపతిలో ఘనంగా జరిగింది.
ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ మరియు HDHR ఇంజనీరింగ్ కాలేజీ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేరువేరుగా జరిగింది..ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతాడు..’ఆయన సినిమాలకు ఇక్కడ నేను టికెట్స్ తీసుకొని థియేటర్ కి వెళ్ళేటప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని..ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను..ఇప్పుడు నా సినిమాకి కూడా అలా వెళ్లే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు’ అంటూ చాలా గొప్పగా మాట్లాడుతాడు..అప్పటి వరుకు ఈయన పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని ఎవరికీ తెలియదు.

కానీ ఈరోజు ఆయన వైసీపీ పార్టీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవ్వడం పెద్ద చర్చ కి దారి తీసింది..’రాజకీయంగా నాకు జగన్ అంటే చాలా ఇష్టం..నాకు ఇక్కడ ఓటు హక్కు ఉంటే ఆయనకే ఓటు వేసేవాడిని..నేను కేవలం ఆయన మీద ఇష్టంతోనే కలవడానికి వచ్చాను..ఎలాంటి రాజకీయ ఉదేశ్యం లేదు’ అంటూ ఆయన కామెంట్ చేసాడు..తన సినిమా ప్రొమోషన్స్ కోసం ఇలా నిన్న పవన్ కళ్యాణ్ జపం, నేడు జగన్ జపం చేస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.