Helicopter trips: హెలికాప్టర్ ప్రయాణం ఎంత సౌకర్యవంతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా నింగిలో తేలియాడుతూ అతి తక్కువ సమయంలో అనుకున్న డెస్టినేషన్‌కు రీచ్ కావచ్చు. అయితే, ఎంత సౌకర్యవంతమో, అంత ప్రమాదకరం కూడా. తాజాగా జరిగిన హెలికాప్టర్ యాక్సిడెంటే కాదు.. గతంలోని చాలా ప్రమాదాలు ఈ విషయాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల సమీపంలోని నింగిలో హెలికాప్టర్ ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమే కాదు.. ప్రాణాంతకం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడు అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయారు. ఈ క్రమంలో బిపిన్ రావత్ వీర మరణం పొందరాని, ఎనలేని త్యాగం దేశం కోసం చేశాడని, భారత ప్రధాని, మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజలు నివాళి అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అయితే, ఇలా కొండ ప్రాంతంలో గతంలో జరిగిన హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లోనూ దాదాపుగా అందులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ఏ ఒక్కరు కూడా ఇటువంటి ఘటనల్లో క్షేమంగా బయటపడలేదు.
గతంలో ఇలా కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినపుడు అందులోని ప్రయాణికుంలందరూ చనిపోయారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలోనే చనిపోయారు. వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరుకు 26 కిలో మీటర్ల దూరంలోని రుద్రకోడు కొండను ఢీ కొంది. దాంతో అందులో ఉన్న వైఎస్ఆర్, ఆయనతో పాటున్న ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ సర్కారుకు చెందిన ఏపీజీ హెలికాప్టర్ ద్వారా చిత్తూరు జిల్లాలోని ‘రచ్చబండ’ కార్యక్రమానికి వైఎస్ఆర్ వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. దివంగత నేత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టంగా ఉన్న మేఘాల మధ్య నుంచి వెళ్లి అలా క్రాష్ అయిపోయిందని ఆ తర్వాత నివేదికలు తేల్చాయి.
నింగిలో దట్టమైన మేఘాలు అలుముకున్నపుడు సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై రక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చుట్టు పక్కల ఎన్విరాన్ మెంట్ సిచ్యువేషన్స్‌ను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుని, అంచనా ప్రకారమే హెలికాప్టర్ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాలుండే ప్రదేశానికి హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేసేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ మాత్రం ప్రమాద సంకేతాలు అందినా వెంటనే అప్రమత్తమై పోవాలి. లేదంటే ప్రాణాలు కోల్పోవడం ఖాయమే. గతంలో జరిగిన ప్రమాదాలు ఇందుకు సాక్ష్యం.
Also Read: Saiteja: అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ.. ‘రావత్’ను మెప్పించాడు?