Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా సినీ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా తనకు తానే కొత్త ఛాలెంజ్ విసురుకున్నారు. విషయాన్ని తానే స్వయంగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. ఇంతకు ముందుకు నాకు చాలా మంచ బాడీ ఉందని అనుకునే వాడ్ని. లేజీనెస్ వల్ల ఇప్పుడు అదంతా పోయింది. జనవరి నుంచి ఛాలెంజ్‌ను స్టార్ట్ చేస్తున్నా.. వచ్చే రెండు నెలల్లో లాస్ట్ ఎక్కడ వదిలేశానో.. అక్కడే స్టార్ట్ చేస్తా.. పనైతే ఎక్కువే ఉంది.. కుదలేదు ఈ సాకులన్నీ నేను చెప్పను. మైండ్ స్ట్రాంగ్‌గా ఉంచుకుని చేసి చూపిస్తా.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విష్ణు ఛాలెంజ్‌పై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన మా అధ్య ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రకాశ్‌రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు కూడా. అనంతరం ఆయన కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అందరూ భావించారు. అయితే, అవన్నీ కేవరం పుకార్లని ప్రకాశ్‌రాజ్ కొట్టిపడేశారు. సేవ చేయాలంటే పదవి ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
Also Read: ఎక్స్ పోజింగ్ లో విశ్వరూపం చూపిస్తోన్న సమంత !
ప్రస్తుతం పలు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రకాశ్ రాజ్.. కేజీఎఫ్ 2లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వచ్చిన జై భీమ్ లోనూ నటించారు. కాగా, ప్రస్తుయం ఆయనకు ఓకల్కార్డ్ సమస్య తలెత్తడంతో.. విశ్రాంతి తీసుకుంటున్నారు.
మరోవైపు మంచి విష్ణు ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మోహన్‌బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి.
Also Read: ఢీ-13 టైటిల్ విజేత ఎవరంటే… స్పెషల్ గెస్ట్ గా అల్లు అర్జున్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actor manchu vishnu 60 days fitness challenge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com