Heeraben- Modi: అమ్మను మించిన దైవం లేదు.. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే.. ఆ పరమాత్ముడైనా ఓ అమ్మకు కొడుకే.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందు ఓ కవి అన్నాడు ‘ఎవరు రాయగలరూ అమ్మా అనే పిలుపు కన్న కమ్మని కావ్యం’ అన్నారు. ఢిల్లీకి రాజైనా… తల్లికి కొడుకే.. దీనిని అక్షర సత్యమని మరోమారు నిరూపించారు దేశ ప్రధాని నరేంద్రమోదీ. మోదీ తల్లి హీరాబెన్(100) శుక్రవారం తెల్లవారుజామున వయోభారం, అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉదయం 10:30 గంటల వర కు గాంధీనగర్‌లో అంత్యక్రిలు పూర్తిచేశారు.

ప్రధాని భావోద్వేగం..
ఆస్పత్రి నుంచి హీరాబెన్ మృతదేహాన్ని గాంధీనగర్‌లోని ఆమె ఇంటికి తరలించారు. ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకుని తల్లిని నిర్జీవంగా చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం గాంధీనగర్‌లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. తల్లిపాడెను మోదీ స్వయంగా మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం పక్కనే కూర్చున్నారు. గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నిరాడంబరంగా నిర్వహించిన అంత్యక్రియల్లో మోదీ కటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కార్యక్రమం అనంతరం శ్మశానవాటిక నుంచే ఢిల్లీ బయల్దేరారు.

ప్రముఖుల సంతాపం..
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. శీతాకాల విడిదిలో తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హీరాబెన్ మృతికి విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై, తెలంగాణ, ఆంధ్రా, గుజరాత్, యూపీ సీఎంతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
Prime Minister @narendramodi carries the mortal remains of his late mother Heeraben Modi. pic.twitter.com/udxGkrvlh8
— PB-SHABD (@PBSHABD) December 30, 2022