Telangana BJP: కష్టపడితే అధికారం దానంతట అదే వస్తుంది. ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి.. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా గెలవాలన్న లక్ష్యంతో.. తెలంగాణలో పాగా వేయాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపే అనే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కమలం నేతలు.

కీలక నిర్ణయాలు..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లా¯Œ తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 5 విడతల్లో పాదయాత్ర పూర్తిచే శారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలలో బీజేపీ నేతలు సఫలమయ్యారు. ప్రతీ సమస్యపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టారు. పార్టీలో ఉన్నవారితోపాటు కొత్తగా పార్టీలో గెలిచే అభ్యర్థులనే చేర్చుకోవాలని అధిష్టానం ఆదేశించింది. ఈమేరకు చేరికల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో బలమైన నేతలకు టికెట హామీ ఇవ్వడానికి కమిటీ సిద్ధమౌతోంది.
పాలక్‌ల నియామకం..
తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలక్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలక్‌లు ప్రతీ నెల మూడు రోజులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలి. పార్టీ కార్యకర్తల బాగోగులు, ఆర్థిక వనరులు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అంతా వీరిపైనే ఉంటుంది. సొంత నియోజకవర్గాలతోపాటు కేటాయించిన నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలి. పార్టీలో విభేదాలు ఉంటే సమసిపోయేలా చొరవ చూపాలి. క్షేత్రస్థాయిలోనూ ఇతర పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను పార్టీలోకి ఆకర్షించాలి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్న ధీమా స్థానిక నేతల్లో తీసుకురావాలి.

మొత్తంగా కమలనాథులు ‘పవర్’ఫుల్ వ్యూహాలతో తెలంగాణలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈమేరకు అధిష్టానం నుంచి కూడా స్థానిక నేతలకు మద్దతు లభిస్తోంది. దీంతో అధికార బీఆర్‌ఎస్‌పై పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారు.