అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. సవాళ్లతో హోరాహోరీని తలపిస్తున్నాయి. గతంలో అమరావతి రాజధానిగా అంగీకరించి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు కాబట్టి .. రెఫరెండంకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఓ సారి ఇలాంటి సవాల్ చేశారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా అదే సవాల్ విసిరారు. దాంతో పాటు ఆయన మరో ఆఫర్ కూడా ఇస్తున్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు నిర్ణయిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని అంటున్నారు.
Also Read: చర్చకు దారితీసిన జగన్ నిర్ణయం
అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ అంగీకరించారు. అంతేకాదు.. 30 వేలకుపైగా ఎకరాలు కావాలని చెప్పడం వంటివి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు తాను ఇల్లు కట్టుకున్నానని.. చంద్రబాబే కట్టుకోలేదని.. రాజధానిని ఎందుకు తరలిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ నేతలు.. అమరావతిలోనే రాజధాని అని కుండబద్దలు కొట్టారు. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఇలాంటి సందర్భాల్లో మళ్లీ మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్న చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేయాలనే ఆలోచన చేయడం లేదు. టీడీపీ నేతలపై ఎదురు దాడి చేస్తున్నారు. చంద్రబాబు అసలు రాజకీయాల్లో ఉన్నారా అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు కానీ.. అసలు విషయం మాత్రం చెప్పడం లేదు.
Also Read: క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్ కేథడ్రల్
వీటికితోడు.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఉచిత సలహాలిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం బలపడే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా మూడు రాజధానులకు ప్రజల్లో మద్దతు లేదని ప్రభుత్వానికి కూడా తెలుసని అందుకే.. రెఫరెండానికి వెనుకడుగు వేస్తోందని విపక్షాలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి. ఈ విమర్శల నుంచి జగన్ ఎలా బయటపడుతారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్