https://oktelugu.com/

సినీ ఇండస్ట్రీకి జగన్‌ చేయూత

ఇప్పటికే సంక్షేమ పథకాలంటూ ప్రజలను ఆకట్టుకుంటున్న ఏపీ సీఎం జగన్‌.. లాక్‌డౌన్‌తో పూర్తిగా కష్టాల్లో మునిగిపోయిన వారిని సైతం ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా.. సినిమా ఇండస్ట్రీకి.. థియేటర్లకు వరాలు కురిపించారు. మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 1,100 సినిమా థియేటర్లకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వడ్డీపై సబ్సిడీ ఇవ్వనున్నారు. మొత్తంగా సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేయబోతున్నారు. ఈ ప్యాకేజీ కింద 50 వేల నుంచి 15 లక్షల వరకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 1:06 pm
    Follow us on

    Telugu Cinema Industry
    ఇప్పటికే సంక్షేమ పథకాలంటూ ప్రజలను ఆకట్టుకుంటున్న ఏపీ సీఎం జగన్‌.. లాక్‌డౌన్‌తో పూర్తిగా కష్టాల్లో మునిగిపోయిన వారిని సైతం ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా.. సినిమా ఇండస్ట్రీకి.. థియేటర్లకు వరాలు కురిపించారు. మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 1,100 సినిమా థియేటర్లకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వడ్డీపై సబ్సిడీ ఇవ్వనున్నారు. మొత్తంగా సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేయబోతున్నారు. ఈ ప్యాకేజీ కింద 50 వేల నుంచి 15 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు.

    Also Read: ఏపీలో వేడెక్కిన రాజకీయం

    మార్చి నుంచి కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీలో చోటు కల్పించారు. ఇందుకోసం 198 కోట్ల కేటాయించారు. ఈ మొత్తం సినీ పరిశ్రమకే ఇవ్వరు. ఇతర వినోద , పర్యాటక సంస్థలకూ కేటాయిస్తారు. అలాగే.. ఇస్తున్న రుణాలపై 6 మాసాలు మారటోరియం విధిస్తారు. ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్‌డ్ చార్జీలను రద్దు చేస్తారు. కరోనా అనంతర పరిస్థితులతో సినిమా ఇండస్ట్రీ రీ స్టార్ట్ కాలేకపోతోంది. మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకుంటాయో లేదో తెలియని పరిస్థితి.

    మరోవైపు ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు.. మళ్లీ థియేటర్లకు వస్తారా రారా అనే సందేహం ఉంది. ఇలాంటి సమయంలో.. వినోద పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రైతు భరోసా మూడో సీజన్‌ నగదును డిసెంబర్ 29న రైతుల అకౌంట్‌లో వేయాలని నిర్ణయించారు. ఏపీ కొత్త పర్యాటక విధానాన్నినికి కేబినెట్‌ ఆమోదం ఆమోదించారు.

    Also Read:చర్చకు దారితీసిన జగన్‌ నిర్ణయం

    పర్యాటక ప్రాజెక్టుల పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్ జిఎస్టీ, స్టాంపు డ్యూటీ మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటించారు. నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని నిర్ణయించారు. మెడికల్ రీసెర్చ్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. మెడికల్ కాలేజీలను వాటి కిందకు చేర్చబోతున్నారు. రూ.16 వేల కోట్ల రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. దీనికి కేబినెట్ ఆమోదించింది. మొత్తంగా కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ లాగే.. జగన్‌ కూడా ఆయా రంగాలకు చేదోడుగా నిలుస్తుండడం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్