AP Government Debits: సాధారణంగా ప్రభుత్వాలు ఆదాయ వనరులపై ద్రుష్టిపెడతాయి. పరిశ్రమల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తాయి. రాష్ట్రంలో విరివిగా పెట్టబుడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానిస్తాయి. అందుకు ఏపీ ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఎప్పుడు చూస్తే అప్పులు కావాలి.. అప్పుల కోసం అనుమతులు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ ప్రదక్షణలు చేస్తోంది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయించింది. మే 10న రూ.3 వేల కోట్లు అప్పులు పొందిన సంగతి తెలిసిందే. మే 17న ఆర్ బీై నిర్వహించే సెక్యూరిటీ వేలంలో పాల్గొని మరో రెండు వేల కోట్లు పొందాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 17 వరకు అంటే 47 రోజుల్లో సర్కారు రూ.9,390 కోట్లు అప్పు తెచ్చింది. జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిన అప్పుల కారణంగా కొత్త అప్పులకు అనుమతిచ్చేది లేదని భీష్మించిన కేంద్రం.. ఎట్టకేలకు రాజకీయ ఒత్తిడికి తలొగ్గింది. దొంగ అప్పుల విషయంలో మన రాష్ట్రానికి ఏ మాత్రం తీసిపోకుండా తెలంగాణ కూడా అనేక మార్గాల్లో అప్పులు చేస్తోంది. అయితే తెలంగాణకు ఇప్పటి వరకు కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రకు మాత్రం సరేనంది. దీనిపై తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80 వేల కోట్లు అప్పులు కావాలని జగన్ ప్రభుత్వం కోరగా.. కేంద్రం మాత్రం రూ.28 వేల కోట్లకే అనుమతించింది. అనుమతి వచ్చిన వారంలోనే రూ.5 వేల కోట్ల అప్పులు చేయడం చూస్తుంటే అప్పులపై జగన్ సర్కారు ఏ విధంగా ఆధారపడుతోందో అర్థమవుతోంది.
Also Read: Balakrishna: బాలయ్య అప్పట్లో ఎంత కట్నం డిమాండ్ చేశారో తెలుసా ?
ఆర్థిక దివాళా దిశగా..
రాష్ట్రం ఆర్థిక దివాళా వైపు పరుగు తీస్తోంది. నెలకు రూ.5-6 వేల కోట్లు అప్పులు తెస్తే గానీ రాష్ట్రంలో గడవని పరిస్థితి. ఈ నెల 17న రూ.2 వేల కోట్లు అప్పులు తెచ్చిన తర్వాత ఈ నెల పూర్తవడానికి మరో 13 రోజులు ఉన్నందున ఇంకో రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం 12 నెలల పాటు వాడుకునేందుకు రూ.28 వేల కోట్లకు అనుమతిస్తే.. సర్కారు నాలుగు నెలల్లోనే ఆ మొత్తాన్ని వాడుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత రాష్ట్రాన్ని నడపడానికి అదనపు అప్పులు కావాలంటూ కేంద్రం చుట్టూ మళ్లీ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఈలోపు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తేవడానికి అవసరమైన జీవోల జారీకి, చట్ట సవరణలకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల నుంచి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం చాలా శాఖల ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. మూడో వారం దాటుతున్నా కింది స్థాయి సిబ్బందికి వేతనాలు అందని దుస్థతి. ముఖ్యంగా అత్యవసర విభాగానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కారు. పింఛనుదారులు సైతం పెన్షన్ సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా అప్పుపుడితే కానీ వీరికి చెల్లించే పరిస్థతి లేదు. ఏ నెలకు ఆ నెల ప్రభుత్వం అప్పులతో సరిపెడుతుందే కానీ.. ఆదాయ మార్గాల వైపు మాత్రం ద్రుష్టిపెట్టడం లేదు. దీంతో దివాళా తప్పదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Dharma Reddy: ఆ ‘రెడ్డి’పై ఎందుకంత ప్రేమ?