https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఎలిమినేట్ అయిన తర్వాత గౌతమ్ ని డేంజర్ లో పడేసి వెళ్లిన యష్మీ.. ఇది మామూలు మాస్టర్ స్ట్రోక్ కాదుగా!

బిగ్ బాస్ టీం ఈగో బాగా నొచ్చుకుంది. అందుకే గౌతమ్ ని నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చేత తిట్టించి, అతన్ని నెగటివ్ చేసి, ఓటింగ్ గ్రాఫ్ ని తగ్గించాలని చూసారు. ఈ ప్లాన్ కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ లో గౌతమ్ కి తక్కువ స్పేస్ వచ్చే భారీ ప్లానింగ్ వేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 24, 2024 / 09:24 AM IST

    Bigg Boss Telugu 8(242)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ టీం ఎందుకో గౌతమ్ ని దారుణంగా టార్గెట్ చేసి, అతని గ్రాఫ్ క్రిందకు లాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీం కి నిఖిల్ విన్నర్ అవ్వాలని ఉంది. గౌతమ్ నిఖిల్ లాగా స్టార్ మా ఛానల్ లో సీరియల్స్ చేసేవాడు కాదు. ఈవెంట్స్ లో కూడా గౌతమ్ పెద్దగా కంటెంట్ ఇచ్చింది లేదు. కాబట్టి వాళ్లకి నిఖిల్ ని విన్నర్ ని చేస్తే సీరియల్స్ చేయొచ్చు, అదే విధంగా ఈవెంట్స్ లో కూడా బోలెడంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వస్తుంది. అందుకే గౌతమ్ ని టైటిల్ రేస్ నుండి తప్పించడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఉదాహరణకి ఈ వారం రోప్స్ టాస్క్ లో గౌతమ్ సంచాలక్ గా చేసి, అతన్ని బీభత్సమైన నెగటివ్ చేయడానికి పన్నాగాలు చేసింది బిగ్ బాస్ టీం. కానీ గౌతమ్ బిగ్ బాస్ టీం కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి, వాళ్ళ ప్లాన్ ని తన తెలివితో ఫెయిల్ అయ్యేలా చేసాడు.

    దీనికి బిగ్ బాస్ టీం ఈగో బాగా నొచ్చుకుంది. అందుకే గౌతమ్ ని నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున చేత తిట్టించి, అతన్ని నెగటివ్ చేసి, ఓటింగ్ గ్రాఫ్ ని తగ్గించాలని చూసారు. ఈ ప్లాన్ కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ లో గౌతమ్ కి తక్కువ స్పేస్ వచ్చే భారీ ప్లానింగ్ వేసాడు. అసలు ఏమి జరిగిందంటే, నిన్న ఎపిసోడ్ చివరి 15 నిమిషాలు యాక్షన్ రూమ్ లో కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి ల్యాడర్ మరియు స్నేక్ గేమ్ ఆడించారు. ఈ టాస్క్ లో అత్యధికంగా పృథ్వీ, నిఖిల్, గౌతమ్ లకు స్నేక్ వచ్చింది. ఎపిసోడ్ చివర్లో స్నేక్ వచ్చిన ఈ ముగ్గురిలో ఒకరిపై బిగ్ బాంబ్ పడనుంది అని అంటాడు నాగార్జున. ఆ బాంబ్ ఏమిటన్నది నిన్న చెప్పలేదు.

    అయితే నేటి ఎపిసోడ్ లో యష్మీ ఎలిమినేట్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ని నిన్ననే పూర్తి చేసారు. యష్మీ ని వెళ్లే ముందు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిపై ఆ బాంబుని ప్రయోగించమని చెప్తాడు నాగార్జున. ఆ బాంబు ఏమిటంటే, ఈ వారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని డైరెక్ట్ నామినేషన్స్ ఒకే పంపాలి. యష్మీ ఊహించినట్టే గౌతమ్ ని నామినేషన్స్ లోకి నేరుగా పంపింది. దీంతో గౌతమ్ ని రేపు నామినేషన్స్ లో ఎవ్వరూ వెయ్యలేరు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరి మీద ఒకరికి పాయింట్స్ లేవు. అందరికీ గౌతమ్ తోనే సమస్య. అతన్ని సాఫ్ట్ టార్గెట్ చేసి నామినేట్ చేయాలనే ప్లాన్స్ ఏసుకొని ఉంటారు. అవి ఫెయిల్ అయ్యింది. అదే విధంగా గౌతమ్ కి నామినేషన్స్ ఎపిసోడ్స్ పెద్ద పాజిటివ్. ఇప్పుడు ఆయన్ని ఎవ్వరూ నామినేట్ చేయరు కాబట్టి, ఆయనకి కావాల్సిన స్కోప్ దొరకదు, ఇది గౌతమ్ కి కాస్త మైనస్. నామినేషన్స్ దగ్గర నుండే గౌతమ్ ని ఇలా టార్గెట్ చేసారు, రాబోయే రోజుల్లో అతని గ్రాఫ్ ని తగ్గించడానికి బిగ్ బాస్ టీం ఇంకెన్ని ఎత్తులు వేస్తుందో చూద్దాం.