
రేవంత్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో ఆయనో ఫైర్‌బ్రాండ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆయనదే పెద్ద వాయిస్. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఆయన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయనకు స్వపక్షం నుంచి.. విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.
Also Read: అన్నదమ్ముల సవాల్.. కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి..!
ఒకవైపు అధికార టీఆర్‌ఎస్‌ను.. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీ స్పీడ్‌ను తట్టుకుంటూ.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి గట్టిగానే కృషి చేస్తున్నారు. ఎన్నో కేసులను, మరెన్నో రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొంటూనే కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కంటే సొంత పార్టీ నాయకుల నుంచే రేవంత్‌కు ఎక్కువ ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను ఎన్ని విమర్శలు చేసినా, అది రాజకీయంగా తమ ప్రత్యర్థులకు బలంగా మారుతుందనే ఉద్దేశంతో రేవంత్ సైలెంట్‌గా ఉంటున్నారు.
Also Read: ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? టీఆర్‌ఎస్‌లో షివరింగ్
మరోవైపు.. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ పదవికి ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాకపోతే రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తలు అటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు, ఇటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేయాలని డిసైడ్ అయిపోయింది. ఆయనకు పీసీసీ దక్కితే తమకూ ఇబ్బందే అనే భావనలో బీజేపీ ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అందుకే.. బీజేపీ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులపై ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలోకి వెళ్తున్నాను అంటూ తిరుమలలో సంచలన ప్రకటన చేశారు. ఇక రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇస్తే మరికొంత మంది సీనియర్ నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పులులు సింహాలు కాదని, పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే నాయకత్వం కావాలి అంటూ రాహుల్, సోనియా గాంధీలకు లేఖ రాయడం సంచలనంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తమకు పదవి దక్కినా దక్కకపోయినా ఫర్వాలేదు కానీ రేవంత్‌కు మాత్రం రాకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.