సుప్రీం కోర్టు జడ్జిమెంట్, గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా మెడికల్ సీట్లు ఎలా కేటాయిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి మెడికల్ సీట్ల కేటాయింపుపై హైకోర్టుకు వస్తున్నారని, గతంలో దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ ఏమైందని, దాని సిఫార్సులపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విధంగా సీట్ల కేటాయింపు సరికాదని ఆదేశాలు ఇస్తామని ఒక దశలో తెలిపింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరపు న్యాయవాది వివరాలు తెలిపేందుకు సమయం కోరారు. దీంతో కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
కేసుకు సంభందించిన వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ యూనివర్సిటీలో మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీ వర్గాల విద్యారులకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. క్లాజ్ 8 ప్రకారం విద్యార్థులకు రిజర్వేషన్ సీట్లను కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైద్యుడు ఆలా వెంకటేశ్వర రావు పిటిషన్ లో పేర్కొన్నారు.