భారత్ తో యుద్ధానికి సై.. చైనా ప్లాన్ ఏంటి?

చైనా దూకుడుగా ఉంది. పోయిన తన పరువును కాపాడుకునేందుకు పెద్ద ప్లాన్లు వేస్తోంది. అటు జపాన్ ను ఇటు భారత్ ను సరిహద్దుల్లో కవిస్తోంది. చైనా సైనికులు భారత భూభాగాల్లోకి వస్తూ భారత సైనికులతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. సరిహద్దులను ఉల్లంఘిస్తున్నారు. దీంతో అటు చైనా అధ్యక్షుడు, ఇటు ప్రధాని మోడీలు పరస్పర దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్-చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది. *కరోనాతో అపవాదు.. యుద్ధాలతో మరల్చేందుకు.. కరోనా వైరస్ పుట్టించి […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 6:33 pm
Follow us on


చైనా దూకుడుగా ఉంది. పోయిన తన పరువును కాపాడుకునేందుకు పెద్ద ప్లాన్లు వేస్తోంది. అటు జపాన్ ను ఇటు భారత్ ను సరిహద్దుల్లో కవిస్తోంది. చైనా సైనికులు భారత భూభాగాల్లోకి వస్తూ భారత సైనికులతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. సరిహద్దులను ఉల్లంఘిస్తున్నారు. దీంతో అటు చైనా అధ్యక్షుడు, ఇటు ప్రధాని మోడీలు పరస్పర దూకుడుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్-చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది.

*కరోనాతో అపవాదు.. యుద్ధాలతో మరల్చేందుకు..
కరోనా వైరస్ పుట్టించి ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ చైనా తన దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవడం లేదు. ఆ అపవాదు మరల్చేందుకు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతోంది. జపాన్ వైపు కసికసిగా చూస్తోంది. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లోని లఢఖ్, ఉత్తర సిక్కింలలో భారత భూభాగాల్లోకి చైనా సైనికులు రావడంతో భారత్ కూడా భారీగా బలగాలను మోహరిస్తోంది. కరోనా నుంచి వచ్చిన అపవాదును డైవర్ట్ గా మరల్చుకునేందుకు చైనా ఈ కుట్ర చేస్తోందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి.

* తొడగొడుతున్న చైనా అధ్యక్షుడు
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కంపెనీలన్నీ చైనాను ఖాళీ చేస్తుండడం.. .ప్రధాని మోడీ వాటికి రెడ్ కార్పేట్ వేసి ఆకర్షిస్తుండడంతో చైనాకు మండిపోతోంది. అందుకే చైనా అద్యక్షుడు జిన్ పింగ్ భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధ సన్నాహాలకు సిద్ధంగా ఉండాలని తమ సైనిక దళాలకు పిలుపునివ్వడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు తమ సైన్యాన్ని కోరారు.

*ప్రపంచంలోనే అతిభారీ సైన్యం చైనా సొంతం
చైనాకు ప్రపంచంలోనే అతి భారీ సైన్యం ఉంది. దాదాపు 20 లక్షల మిలటరీకి హెడ్ అయిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా ఆర్మీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఆర్మీ శిక్షణను మరింత పెంచుకోవాలని.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా దేశ సార్వభౌమాధికారాన్ని సెక్యూరిటీని పరిరక్షించుకోవడానికి సమాయత్తం కావాలని జిన్ పింగ్ సూచించారని చైనా వార్త సంస్థలు తెలిపాయి. అయితే చైనా ఎవరితో యుద్ధం చేయబోతోంది? ఏ దేశంతో ఫైట్ కు యుద్ధ సన్నాహాలు చేయండనేది మాత్రం జిన్ పింగ్ పేర్కొనలేదు..

*భారత్ కూడా సై.. మోడీ సమీక్ష
ఇక చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ సీరియస్ గా స్పందించారు. వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తోనూ.. డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోనూ సమావేశమయ్యారు. విదేశాంగ శాఖ కార్యదర్శితోనూ భేటి అయ్యారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. త్రివిధ దళాధిపతులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సిక్కిం, లడఖ్ ప్రాంతాల్లో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారింది.

*మోహరించిన చైనా.. ఏం జరగబోతోంది.
భారత్-పాకిస్తాన్-చైనా సరిహద్దుల్లో లడఖ్ సమీపంలో చైనా ఎయిర్ బేస్ నిర్మాణ పనులను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. టర్మాక్ లో చైనా ఫైటర్ జెట్లను మోహరించినట్టుగా సమాచారం. అయితే అధికారికంగా దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం భారత్-చైనాలో మధ్య సిక్కిం, లడఖ్ లలో చైనా సైనికులతో భారత సైనికులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా యుద్ధ సన్నాహాలకు రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే భారత్-చైనాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నట్టే తెలుస్తోంది.

–నరేశ్ ఎన్నం