సచివాలయంలో 3 వేల మందికి కరోనా పరీక్షలు..!

రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల అందరూ విధులకు హాజరు కావాలని కోరడంతో హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులు ఈ రోజు ఉదయం పది బస్సులలో బయలుదేరిన 250 మంది ఉద్యోగులు తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ఆమరావతి చేరుకున్నారు. రెండు నెలల విరామం అనంతరం సచివాలయ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా లాక్ డౌన్ కారణంగా 65 రోజులుగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. లాక్ డౌన్ మినహాయింపు ప్రభుత్వ కార్యాలయాలను చేర్చిన ప్రభుత్వం ఉద్యోగులు […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 6:19 pm
Follow us on


రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల అందరూ విధులకు హాజరు కావాలని కోరడంతో హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులు ఈ రోజు ఉదయం పది బస్సులలో బయలుదేరిన 250 మంది ఉద్యోగులు తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ఆమరావతి చేరుకున్నారు.

రెండు నెలల విరామం అనంతరం సచివాలయ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా లాక్ డౌన్ కారణంగా 65 రోజులుగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. లాక్ డౌన్ మినహాయింపు ప్రభుత్వ కార్యాలయాలను చేర్చిన ప్రభుత్వం ఉద్యోగులు అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.

మంగళగిరి సికె కన్వెన్షన్ హాలులో ఉద్యోగులు కు కరోనా పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్సులలో వచ్చిన ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి స్వాగతం పలికారు. పరీక్షలు అనంతరం ఉద్యోగులను సచివాలయానికి పంపారు. మరోవైపు సచివాలయంలో పనిచేస్తూ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు విధులకు హాజరవుతున్నారు. సచివాలయంలో పని చేస్తున్న మొత్తం మూడు వేల మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగుల కోరడంతో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.