https://oktelugu.com/

Malla Reddy: జీఈసీ గ్రూప్ చదివావా.. మల్లన్న ఎక్కడ ఉందే ఆ గ్రూప్.. వైరల్ వీడియో

మల్లారెడ్డి 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచారు. నాడు సమర్పించిన అఫిడవిట్లో సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చదివినట్లు పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 18, 2023 / 06:34 PM IST

    Malla Reddy

    Follow us on

    Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ… పబ్లిసిటీ కోసం అభ్యర్థులు, నేతలు, టీఆర్పీ రేటింగ్‌ కోసం టీవీ చానెళ్లు పోటాపోటీగా ఇంర్వ్యూలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో కేటీఆర్‌ నుంచి మొదలు, మల్లారెడి‍్డ వరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వరకు అందరూ ఏదో ఒక ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తమ పార్టీని ఎందుకు గెలిపించాలి, అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. ఇప్పటి వరకు ఏం చేశాం అనే వివరాలు వెల్లడిస్తున్నారు. పనిలో పనిగా టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు, ఎడిటర్లు, యాంకర్లు, న్యూస్‌ రీడర్లు కూడా అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతున్నారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి కూడా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చదువు గురించి అడిగిన ప్రశ్నకు.. మల్లారెడ్డి ఇచ్చిన సమాధానంతో రిపోర్టర్లే షాక్‌ అయ్యారు.

    ఒకే ఏడాది మూడు కాలేజీల్లో ఇంటర్‌..
    మల్లారెడ్డి 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచారు. నాడు సమర్పించిన అఫిడవిట్లో సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చదివినట్లు పేర్కొన్నారు. తర్వాత 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వెస్లీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివినట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ రెండూ తప్పు ప్రింట్‌ అనుకుంటే.. తాజాగా 2023లో బీఆర్‌ఎస్‌ నుంచే మళ్లీ మేడ్చల్‌ నుంచే పోటీ చేస్తున్నారు. ఇటీవల నామినేషన్‌ వేశారు. ఇందులో రాఘవ లక్ష్మీనర్సింహ కాలేజీలో ఇంటర్‌ చదివినట్లు పేర్కొన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. మూడు కాలేజీల్లో ఇంటర్‌ చదివింది 1973లోనే కావడం విశేషం.

    ఏం కోర్సు చేశాడో తెలుసా?
    ఇక ఇంటర్‌ మీడియెట్‌ను ఒకే ఏడాది మూడు కళాశాలల్లో చదివినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న మల్లారెడ్డిని ఇటీవల ఓ టీవీ ఛానెల్‌ డిబేట్‌లో రిపోర్టర్లు.. ఇంటర్‌లో ఏకోర్సు చేశారని అడిగారు. దానికి స్పందించిన మల్లారెడ్డి తాను ఇంటర్‌లో జీఈసీ చేశానని తెలిపారు. అది అప‍్పట్లో కంప్యూటర్‌ కోర్సని, కొత్త కోర్సని తెలిపాడు. దీంతో అక్కడున్న రిపోర్టర్లు షాక్‌ అయ్యారు. తర్వాత కాసేపటికి ఇంటర్‌ సర్టిఫికెట్లు తెప్పించాడు. అందుకో కామర్స్‌ అని ఉండడంతో ఇదే విషయాన్ని ప్రస్తావించగా, దానిపై మాట దాటవేశారు.