https://oktelugu.com/

Salman Khan Watch: సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఇలాంటి వార్తల్లోనే నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈయన ధరించిన వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దీంతో ఈయన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2023 / 06:28 PM IST

    Salman Khan Watch

    Follow us on

    Salman Khan Watch: సినిమా ఇండస్ట్రీలో ఒకరిని మించి ఒకరు అందంగా, ఆకర్షణీయంగా, ఖరీదైన వస్తువులు ధరించే వారిలాగా కనిపించాలని అనుకుంటారు. అదే రేంజ్ లో అందానికి, వస్తువులకు ఖర్చు పెడుతుంటారు కూడా. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ లు వాడే వస్తువులు ప్రతి ఒక్కటి కూడా లగ్జరీవి ఉంటాయి. వారు ధరించే చెప్పుల దగ్గర నుంచి వాచ్ లు లిప్ స్టిక్ ల వరకు ప్రతి ఒక్కటి ఖరీదు చేసేదిగానే ఉంటుంది. ఇవన్నీ కూడా లక్షలు, కోట్లు ఖరీదు చేస్తాయి. అయితే టాలీవుడ్ నటీనటులతో పోల్చుకుంటే బాలీవుడ్ స్టార్లు మరింత ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

    ప్రస్తుతం ఇలాంటి వార్తల్లోనే నిలిచారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈయన ధరించిన వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దీంతో ఈయన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వజ్రాలు పొందిన రోలెక్స్ వాచ్ ను ధరించిన సల్మాన్ ఖాన్ పై కెమెరా కళ్లు పడ్డాయి. అతని వాచ్ లో కెమెరా జూమ్ చేసి మరీ దాని ధర గురించి చాలా చర్యలు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, భర్త ఆయుష్ శర్మ దీపావళి వేడుకలకు హాజరైన నటుడు స్టైలిష్ బ్లాక్ షర్ట్ ధరించారు.

    సల్మాన్ ఖాన్ వాచ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో అభిమానులు ఈ వాచ్ ఖరీదు ఎంత అని సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. అది టైమ్ పీస్ రోలెక్స్ స్కై డ్వెల్లర్ మోటో రైట్ వాచ్. దాని ధర రూ. 2.9 కోట్లు ఉంటుంది. దీంతో ఈ వాచ్ ధర తెలిసిన వారందరూ కూడా నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఒకటి మాత్రమే కాదు ఖాన్ వద్ద ఇలా కోట్లు విలువ చేసే వాచ్ లు చాలానే ఉన్నాయి. ఇకపోతే సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. మనీష్ శర్మ దర్శకత్వంలో టైగర్ 3 సినిమా ఇటీవల విడుదలైంది. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్ల కాసుల వర్షం కురిపిస్తుంది.