Homeఅంతర్జాతీయంIndia Foreign Policy: భారత్ దౌత్య విధానం మారింది: అమెరికా ఏంటి ప్రపంచమే మోకరిల్లుతోంది

India Foreign Policy: భారత్ దౌత్య విధానం మారింది: అమెరికా ఏంటి ప్రపంచమే మోకరిల్లుతోంది

India Foreign Policy: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు.. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు.. అలాంటి దిమాక్ ఉంది కాబట్టే మోడీ తన విధానాలతో దునియా మొత్తాన్ని భారత్ వైపు చూసేలా చేశాడు. చేస్తున్నాడు.. అందుకే పక్కలో బల్లెం లా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు పడుతోంది.. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడే చైనా త్వరలో కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం ఉంది.. ప్రతిదానికి కాళ్లల్లో కట్టలు పెట్టే అమెరికా ఇప్పుడు మనకు వంత పాడుతోంది.. ఇన్ని పరిణామాలు జరిగాయి అంటే దానికి కారణం ఒకే ఒక్కడు అదే నరేంద్ర మోడీ.. అతని టీం.. ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.

India Foreign Policy
India Foreign Policy

చైనా తెలుసు కదా… తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. తన, పర భేదాలు ఆ దేశానికి ఉండవు. ఈ నేపథ్యంలోనే చైనా పాకిస్తాన్ కు దగ్గర అయింది.. తన అవసరాల నిమిత్తం డబ్బు సహాయం చేసింది.. అసలే ఉగ్రవాద దేశం కాబట్టి పాకిస్తాన్ కూడా సిగ్గులేకుండా తీసుకుంది.. ఇదే సమయంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చైనా పాకిస్తాన్ కు, మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు సహాయం చేయడం మొదలు పెట్టింది.. ఈ క్రమంలో పాకిస్తాన్లో పలు విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం కూడా మొదలుపెట్టింది.. ఇదే సమయంలో గదార్ పోర్టును హస్తగతం చేసుకుంది.. దీని ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా ప్రారంభించింది.. అయితే ఈ పోర్టు వల్ల చైనాకు రవాణా వ్యయం చాలా తగ్గుతుంది.. అందుకే దీనిపై భారీగా పెట్టుబడి పెట్టింది.. అయితే రాను రాను పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుండడంతో చైనాకు బకాయిలు రావడం లేదు.. పైగా రెండు మిలియన్ డాలర్ల సహాయం చేయమని పాకిస్తాన్ కొత్తగా అడుగుతోంది.. దీంతో చైనా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేసి తన దారిన తను వెళ్ళిపోయింది.. అంతేకాదు పాత బకాయిలు చెల్లించమని పాకిస్తాన్ ను డిమాండ్ చేస్తుంది.

ఇక అనేక విషయాల్లో పాకిస్తాన్ కు అండదండగా ఉన్న చైనా… ఉగ్రవాదుల విషయంలో కూడా అదే పల్లవి పాడుతోంది.. ఇందుకు ఉదాహరణేఅబ్దుల్ రెహమాన్ మక్కీ ఉదంతం.. మక్కి పేరు మోసిన ఉగ్రవాది.. ఇతడిని గ్లోబల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాలని భారత్ ఎప్పటినుంచో ఐక్యరాజ్యసమితిలో కోరుతూ వస్తోంది. కానీ దీనికి చైనా మోకాలడ్డుతోంది. ప్రపంచ దేశాలు దీనికి ఓకే చెప్పినప్పటికీ… చైనా తనకు ఉన్న వీటో అధికారం ద్వారా తొక్కిపెడుతోంది. అయితే గత కొంతకాలం నుంచి చైనాలో కోవిడ్ తీవ్రంగా ప్రబలుతోంది. జనాభా లో 70 శాతం ఈ వైరస్ బారిన పడ్డారు..బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ప్రజలకు ఔషధాలు దొరకడం గగమయింది.

India Foreign Policy
India Foreign Policy

దీంతో ఆ దేశానికి మందులు సరఫరా చేస్తామని భారత్ ప్రకటించింది. దెబ్బకు చైనా మనసు మార్చుకుంది. పాక్ కు దూరం జరగడం ప్రారంభించింది. మరో వైపు పాక్ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఇందుకు మరో కారణం. ఇక మక్కీ ని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చాలనే డిమాండ్ కు గత కొంతకాలంగా మోకాలడ్డుతున్న చైనా ఈసారి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.. దీనికి తోడు అమెరికా కూడా భారత్ డిమాండ్ కు తల ఊపడంతో మక్కీ పాక్ దాటి బయటకి వెళ్ళ లేడు. మరో వైపు భారత్ విదేశాంగ విధానాల వల్ల చైనా కూడా మోకరిల్లే పరిస్థితి ఎంతో దూరంలో లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular