2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు , నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే టీవీలు కొనేవాళ్లకు మరో భారీ షాక్ తగలబోతుందని తెలుస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి టీవీల ధరలు ఏకంగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. గతంలోనే టీవీ ధరల పెంపు గురించి వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.
Also Read: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. లక్ష పెట్టుబడికి రూ.40 వేల వడ్డీ..?
ప్యానెల్స్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల టీవీల ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. టెలివిజన్ తయారీకి ప్యానెల్స్ ఎంతో ముఖ్యమైనవనే సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ప్యానెల్స్ సరఫరా తక్కువగా ఉందని.. కస్టమ్స్ సుంకం పెంపు కూడా టీవీల ధరలు పెరగడానికి కారణమని కంపెనీలు చెబుతున్నాయి. కాపర్, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరగడం కూడా టీవీ ధరల పెంపుకు కారణమని సమాచారం.
Also Read: ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు..?
టీవీలను తయారు చేసే కంపెనీలు టీవీల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంలోకి తీసుకురావాలని కోరుతున్నాయి. ఈ స్కీమ్ లోకి టీవీల తయారీని తెస్తే ధరలు తగ్గి కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ లో టీవీలు ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతాయి. ధరలు పెరిగితే కొనుగోళ్లు తగ్గుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు షియోమీ సంస్థ దేశీయ మార్కెట్‌కు ఇప్పటికే ఎమ్‌ఐ స్మార్ట్ టీవీలను పరిచయం చేయగా రెడ్‌మీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను కూడా త్వరలో మార్కెట్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీలకు మార్కెట్ లో భారీగా ఆదరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.